News February 6, 2025
KMR: సైబర్ మోసాలపై జర జాగ్రత్త..!
సైబర్ మోసగాళ్లు అమాయకులను ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచుకుంటున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. బ్యాంకుల నుంచి వచ్చే నకిలీ ఫోన్ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని, కొంత పెట్టుబడి పెడితే ఎక్కువ సంపాదించవచ్చని ఆశచూపి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలన్నారు. కామారెడ్డి ఇందిరానగర్ ZPHSలో సైబర్ జాగృత దివస్ సందర్భంగా కానిస్టేబుల్ ప్రవీణ్ అవగాహన కల్పించారు.
Similar News
News February 6, 2025
SV అగ్రికల్చర్ వర్సిటీకి బాంబు బెదిరింపు
తిరుపతి SV అగ్రికల్చర్ యూనివర్సిటీకి బాంబు బెదిరింపు వచ్చిందని కళాశాల సిబ్బంది తెలిపారు. హ్యూమన్ ఐఈడీ బాంబుతో పేల్చేస్తామంటూ గురువారం ఉదయం కళాశాలకు మెయిల్ వచ్చిందన్నారు. కేరళ నుంచి ఈ మెయిల్ వచ్చినట్టు వారు చెబుతున్నారు. కళాశాల అధికారుల ఫిర్యాదు మేరకు.. తిరుపతి ఎస్పీ సూచనలతో సీఐ చినగోవిందు వర్సిటీలో తనిఖీలు చేపట్టారు.
News February 6, 2025
పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తే కఠిన చర్యలు: CLP
TG: పార్టీ విధానాలను సొంత పార్టీ నేతలే తప్పుపడుతుండటంపై కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (CLP) మీటింగ్‌లో నేతలు చర్చలు జరిపారు. పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించే వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తుంటే ప్రజల్లోకి చెడు సంకేతాలు వెళ్తాయని, ఏవైనా విభేదాలుంటే అంతర్గతంగా చర్చించుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించినట్లు సమాచారం.
News February 6, 2025
WNP: మహిళలు, బాలికల భద్రతకు భరోసా కేంద్రం పెద్దపీట: ఎస్పీ
మహిళల, బాలికల భద్రతకు భరోసా కేంద్రం పెద్దపీట వేస్తుందని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రం ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. భరోసా కేంద్రం ద్వారా మహిళలకు రక్షణ కల్పించడంతోపాటు వారికి అవసరమైన న్యాయం కల్పించడం జరుగుతుందని తెలిపారు.