News February 6, 2025

భద్రాచలం : మహిళను మోసం చేసిన లాయర్‌పై కేసు నమోదు

image

మహిళను మోసం చేసిన లాయర్ పైన కేసు నమోదైన ఘటన భద్రాచలంలో చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భర్తకు దూరంగా ఉంటున్న మహిళ, తన భర్తపై చట్టపరంగా పోరాడేందుకు  న్యాయవాది భరణి కార్తీక్‌ను ఆశ్రయించింది. ఒంటరిగా జీవిస్తున్న బాధిత మహిళను వివాహం చేసుకుంటానని నమ్మించి, గర్భం దాల్చిన తర్వాత కార్తీక్ పెళ్లికి నిరాకరించాడు. ఈ మేరకు ఆమె భద్రాచలం పోలీసులను ఆశ్రయించగా కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 6, 2025

‘SIR’ను వ్యతిరేకించిన మమతకూ ఫామ్ ఇచ్చిన BLO

image

SIRకు వ్యతిరేకంగా 2 రోజుల కిందట బెంగాల్ CM మమతా బెనర్జీ <<18197344>>ర్యాలీ<<>> నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాతి రోజే ఓటర్ లిస్ట్ ఎన్యుమరేషన్ ఫామ్‌ను ఆమె అందుకున్నారు. కోల్‌కతాలోని CM నివాసానికి నిన్న బూత్ లెవల్ ఆఫీసర్ వెళ్లారు. ఫామ్‌ను నేరుగా మమతకే ఇస్తానని సెక్యూరిటీ సిబ్బందికి BLO చెప్పినట్లు సమాచారం. దీంతో స్వయంగా మమత వచ్చి తీసుకున్నారని తెలుస్తోంది. దాన్ని నింపిన తర్వాత BLOకు ఇవ్వనున్నారు.

News November 6, 2025

పీయూకి నేడు మందకృష్ణ మాదిగ రాక

image

పాలమూరు విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయ ఆడిటోరియంలో మధ్యాహ్నం రెండు గంటలకు రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయిపై దాడులకు వ్యతిరేకంగా చలో ఢిల్లీ కార్యక్రమం ఈనెల 17న నిర్వహించనున్నారు. అందులో భాగంగా ఈ సమావేశంలో ప్రణాళిక సిద్ధం చేయనున్నారు.

News November 6, 2025

ఖమ్మం: మాయమై పోతున్నడమ్మా.. మనిషన్న వాడు..!

image

మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. క్షణికావేశంలో, డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఇటీవల తిరుమలాయపాలెం(M)నికి చెందిన ఒక వ్యక్తి మద్యానికి డబ్బులు ఇవ్వడం లేదని కన్నతల్లినే గొడ్డలితో నరికి హత్య చేశాడు. సత్తుపల్లిలో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని భార్యని ఓ వ్యక్తి హతమార్చాడు. ఖమ్మం(R)లో సోదరుల మధ్య పంచాయితీలో తమ్ముడిని అన్న హత్య చేశాడు. చింతకాని(M)లో వివాహేతర సంబంధంతో ఓ భార్య భర్తను చంపింది.