News February 6, 2025

సిరిసిల్ల: రైతులకు కిసాన్ APK లింక్.. రూ.లక్షన్నర మాయం

image

కిసాన్ ఏపీకే పేరిట వచ్చిన లింక్ ఓపెన్ చేసిన రైతుల బ్యాంకు ఖాతాల్లో నుంచి డబ్బులు మాయమయ్యాయి. పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల జమ వివరాలు తెలుసుకోవాలంటే ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలని కోనరావుపేటకు చెందిన ఇద్దరు, మంగళ్లపల్లికి చెందిన ఒక రైతు వాట్సాప్‌కు లింక్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేయగానే ముగ్గురి ఖాతాల్లో నుంచి రూ.32 వేలు, రూ.57 వేలు, రూ.70 వేల చొప్పున కట్ అయ్యాయి. PSలో ఫిర్యాదు చేశారు.

Similar News

News March 25, 2026

కామారెడ్డిలో సినీ నటుడు వెన్నెల కిశోర్

image

కామారెడ్డి పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందని సినీ నటుడు వెన్నెల కిశోర్ అన్నారు. కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ పున్న రాజేశ్వర్ కుటుంబ సభ్యులను ఆయన కుటుంబ సమేతంగా మంగళవారం కలిశారు. వెన్నెల కిశోర్ మాట్లాడుతూ.. పున్న రాజేశ్వర్‌తో తమకు బందుత్వం ఉందన్నారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం పట్టణానికి వస్తామన్నారు.

News March 25, 2026

రష్యా, ఇరాన్‌కు ఇజ్రాయెల్ షాక్

image

ఇరాన్‌కు అన్ని వనరులు కట్ చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇటీవల ఇరాన్-రష్యా మధ్య ఆయుధాల సరఫరాకు కీలకమైన కాస్పియన్ సముద్రం మార్గాన్ని టార్గెట్ చేసింది. ఇరాన్ నేవీ, మౌలికవసతులు ధ్వంసమయ్యేలా బందర్ అన్జాలీ పోర్టుపై దాడి చేయడం చర్చనీయాంశమైంది. ఇరాన్ – రష్యాల మధ్య మిసైల్స్, డ్రోన్లు, గన్స్ మొదలైనవి సరఫరా కావడానికి ఈ పోర్టు కీలకం. ఈ దాడితో ఇరు దేశాలకు ఇజ్రాయెల్ భారీ నష్టం కలిగించింది.

News March 25, 2026

ఏలూరు: శిశువుల విక్రయాలు, కిడ్నాప్స్.. పోలీసుల తీరుపై అనుమానాలు!(1/2)

image

జిల్లాలో పసిపిల్లల విక్రయాలే కాకుండా రెండు సంవత్సరాల మోక్షిత్ కిడ్నాప్ వ్యవహారంపై పోలీసులు పట్టించుకున్న దాఖలాలు లేవనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పసిపిల్లల విక్రయాలలో కేసులో జనసేన మండల నాయకుడు అనిశెట్టి నాగబాబు తల్లి వీరమ్మను మాత్రమే అరెస్టు చేశారు. ఇందులో నాగబాబు, అదేవిధంగా మరో నాయకుడు ఆంజనేయులు అలియాస్ అంజిబాబు ఉన్నప్పటికీ వారిని అదుపులోకి తీసుకోలేదు.