News February 6, 2025

WGL: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్, ఆర్.ఆర్.బీ, ఎస్.ఎస్.సి. ఫౌండేషన్ కోర్సుల ఉచిత శిక్షణ కోసం దరఖాస్తుకు ఈ నెల 9 వరకు అవకాశం ఉందని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రసాద్ తెలిపారు. అర్హత గల అభ్యర్థులు https://tgbcstudycircle.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంటర్, డిగ్రీ మార్కులు, రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఎంపికైన వారికి ఈ నెల 15 నుంచి శిక్షణ ఉంటుందన్నారు.

Similar News

News February 6, 2025

మూడు విడతలుగా ‘అన్నదాత సుఖీభవ’: చంద్రబాబు

image

AP: పీఎం కిసాన్ పేరిట కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరో రూ.14 వేలు కలిపి ‘అన్నదాత సుఖీభవ’ అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ఆర్థిక సాయాన్ని మూడు విడతలుగా ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పారు. దీనిపై విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. యువతకు ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు. రాబోయే మూడు నెలల్లో ప్రజలకు అందాల్సిన పథకాలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.

News February 6, 2025

‘కోడుమూరు మాజీ MLAపై చీటింగ్ కేసు పెడతాం’ 

image

కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణపై చీటింగ్ కేసు నమోదు చేయాలని అదే పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ డిమాండ్ చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ నిధులను మురళీకృష్ణ దారి మళ్లించే ప్రయత్నం చేశారు. కార్యకర్తలు, నేతల కళ్లుగప్పి ఆయన తన సొంత సొసైటీ ఏర్పాటు చేసి నిధులు కాజేయాలని చూశారు. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం’ అని లక్ష్మీ నరసింహ చెప్పారు. 

News February 6, 2025

సంగారెడ్డి: ALERT.. 9న చివరి గడువు

image

బీసీ స్టడీ సర్కిల్‌లో ఎస్ఎస్‌సీ, ఆర్ఆర్‌బీ, బ్యాంకింగ్ ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను www.bcstudycircle.comలో ఈనెల 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఎంపికైన వారికి ఈనెల 15 నుంచి 100 రోజులపాటు తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు.

error: Content is protected !!