News February 6, 2025

HYD: ఒకే రోజు 10 మంది మృతి!

image

HYDలో విషాద ఘటనలు వెలుగుచూశాయి. నిన్న ఒక్కరోజే 10 మంది చనిపోయారు. LBనగర్‌‌లో గోడ కూలి ముగ్గురు మృతి చెందారు. గచ్చిబౌలిలో రిటోజ, SRనగర్‌లో అమర్‌జిత్, రాయదుర్గంలో ధర్మప్రధాన్, షాద్‌నగర్‌లో నీరజ్, చెరువులో దూకి పీర్జాదిగూడ వాసి బాలరాజు, మీర్‌పేటలో వెంకటేశ్ ఆత్మహత్య చేసుకున్నారు. వేర్వేరు కారణాలతో ఆరుగురు సూసైడ్ చేసుకోగా.. శంకర్‌పల్లిలో బస్ ఢీ కొని బీటెక్ విద్యార్థి మృతి చెందడం బాధాకరం.

Similar News

News March 4, 2026

RR: నిఘా నీడలో పరీక్షలు.. 1,916 మంది డుమ్మా

image

నిఘా నీడలో ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇవాళ ఉ.9 గంటల నుంచి మ.12 గంటల వరకు బుధవారం ఇంటర్ 2nd ఇయర్ పరీక్ష జరిగింది. రంగారెడ్డి జిల్లాలో 80,463 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా.. 78,547 మంది విద్యార్థులు హాజరయ్యారు. 1,916 మంది విద్యార్థులు వివిధ కారణాలతో హాజరు కాలేకపోయారు.

News March 3, 2026

రంగారెడ్డి జిల్లాలో ప్రధాన ఆలయాలు మూసివేత

image

పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా రంగారెడ్డి జిల్లాలోని ప్రధాన ఆలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు ఫరూఖ్‌నగర్ మండంలోని ఉత్తరరామలింగేశ్వ రస్వామి, ఎలికట్ట అంబాభవానీ ఆలయాలు, చేవెళ్లలోని వేంకటేశ్వర ఆలయం, కడ్తాల్ మం.లోని మైసిగండి మైసమ్మతల్లి ఆలయం, నర్కుడలోని అమ్మపల్లి ఆలయ ద్వారాలు మూసివేశారు. గ్రహణం పూర్తయిన అనంతరం శుద్ధి చేసి తెరుస్తామన్నారు.

News March 2, 2026

RR: ప్రజావాణికి 51 ఫిర్యాదులు: కలెక్టర్

image

రంగారెడ్డిలో కలక్టరేట్‌లో ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ నారాయణ రెడ్డికి విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ప్రజావాణికి 51 ఫిర్యాదులు అందాయని, అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.