News February 6, 2025
సంగారెడ్డిలో తగ్గిన చికెన్ ధరలు
సంగారెడ్డి జిల్లాలో చికెన్ ధరలు తగ్గాయి. వారం రోజుల క్రితం కిలో రూ.220పైగానే అమ్మారు. గురువారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. కిలో స్కిన్‌లెస్ KG రూ.210 నుంచి రూ.220, విత్ స్కిన్ రూ.180 నుంచి రూ.190 మధ్య విక్రయిస్తున్నారు. హోల్ సేల్ దుకాణాల్లో రూ.5 నుంచి రూ.10 వరకు తగ్గించి అమ్ముతున్నారు. పౌల్ట్రీ పరిశ్రమల్లో H5N1 వైరస్ వల్ల కోళ్లు చనిపోవడంతో ధరలు తగ్గడానికి కారణమని తెలుస్తోంది.
Similar News
News February 6, 2025
బీసీలకు రేవంత్ అన్యాయం: ఆర్.కృష్ణయ్య
TG: రాష్ట్రంలోని బీసీలకు కేసీఆర్ కంటే CM రేవంత్ ఎక్కువ అన్యాయం చేస్తున్నారని బీసీ నేత ఆర్.కృష్ణయ్య విమర్శించారు. BCలకు చట్టప్రకారం 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘రాష్ట్రంలో జరిగిన కులగణనలో చాలా బీసీ కుటుంబాలు పాల్గొనలేదు. లేదంటే బీసీల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండేది. కులగణనపై చట్టం చేస్తే మేం సుప్రీంకోర్టులో పోరాడుతాం. రాజకీయాలు చేయడం మాకూ వచ్చు’ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
News February 6, 2025
NZB: ఉపాధ్యాయులకు డీఈవో నోటీసులు
సమయానికి పాఠశాలకు హాజరు కాని నలుగురు ఉపాధ్యాయులకు డీఈవో అశోక్ షోకాజ్ నోటీసులను జారీ చేశారు. గురువారం నిజామాబాద్ వినాయకనగర్ ప్రాథమికోన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఆ సమయంలో టీచర్లు రాకపోవడంతో నోటీసులు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాఠశాల సమయానికి ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించడంతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
News February 6, 2025
శంషాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు.. క్లారిటీ
శంషాబాద్‌లో కూల్చివేతలపై హైడ్రా క్లారిటీ ఇచ్చింది. రాళ్లగూడ విలేజ్ వద్ద ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డుకు వెళ్లే దారి లేకుండా 55 మీటర్ల మేర ప్రహరీ నిర్మించారు. సర్వీసు రోడ్డుకు వెళ్లే దారి లేకుండా చేశారని రాళ్లగూడ విలేజ్ పరిసర ప్రాంతాల లేఔట్‌ల నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.