News February 6, 2025

ములుగు: రైతు భరోసా డబ్బులు జమ!

image

ములుగు జిల్లా వ్యాప్తంగా రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమవుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు ఎకరం లోపు విస్తీర్ణం కలిగిన రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ అయినట్లు రైతులు తెలిపారు. ఎకరం విస్తీర్ణానికి పైగా ఉన్న రైతులకు కూడా ఒకటి, రెండు రోజుల్లో భరోసా నిధులు జమవుతాయని ప్రభుత్వం వెల్లడించింది.

Similar News

News February 6, 2025

శంషాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు.. క్లారిటీ

image

శంషాబాద్‌లో కూల్చివేతలపై హైడ్రా క్లారిటీ ఇచ్చింది. రాళ్ల‌గూడ విలేజ్ వ‌ద్ద ఓఆర్ఆర్ స‌ర్వీసు రోడ్డుకు వెళ్లే దారి లేకుండా 55 మీట‌ర్ల మేర ప్ర‌హ‌రీ నిర్మించారు. స‌ర్వీసు రోడ్డుకు వెళ్లే దారి లేకుండా చేశార‌ని రాళ్ల‌గూడ విలేజ్ ప‌రిస‌ర ప్రాంతాల లేఔట్‌ల నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేయ‌డంతో ఈ మేర‌కు చ‌ర్య‌లు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

News February 6, 2025

కరెంట్ ఛార్జీలు పెంచేది లేదు: సీఎం

image

AP: ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కరెంట్ ఛార్జీలు పెంచేందుకు వీల్లేదని మంత్రివర్గ సమావేశంలో తేల్చి చెప్పారు. అవకాశం ఉంటే తగ్గించాలన్నారు. సూర్యఘర్, పీఎం కుసుమ్ వేగంగా అమలయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. నూతన విద్యాసంవత్సరం మొదలయ్యేలోపే డీఎస్సీ పోస్టులు భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

News February 6, 2025

భద్రాద్రి: 38,536 మందికి రైతు భరోసా నిధులు జమ

image

తెలంగాణ ప్రభుత్వం యాసంగి సాకు కింద రైతు భరోసా నిధులను విడుదల చేసింది. మండలాలు, గ్రామాల వారీగా ఒక ఎకరం వరకు సాగులో ఉన్న రైతుల ఖాతాలో నగదు జమ చేసింది. భద్రాద్రి జిల్లాలో ఎకరంలోపు భూమి ఉన్న 38,536 మంది రైతుల ఖాతాలలో రూ.45,683,6754 జమయ్యాయి. గతంలో రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.5 వేల చొప్పున అందిస్తుండగా, ప్రస్తుతం రూ.6 వేలకు పెంచిన విషయం తెలిసిందే.

error: Content is protected !!