News February 6, 2025

జగన్ ఇంటి వద్ద అగ్నిప్రమాదం.. TDP సంచలన ట్వీట్

image

AP: లిక్కర్ స్కాంపై ఉదయం సిట్ పడగానే రాత్రి తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడిన కాగితాలు, డైరీలు ఏంటని TDP ప్రశ్నించింది. ‘సిట్ తనవరకు వస్తుందని స్కాంకి సంబంధించి రాసుకున్న డాక్యుమెంట్లు తగలబెట్టారా? నిన్న సాయంత్రం జరిగితే ఇంకా CC ఫుటేజీ ఎందుకు బయటపెట్టలేదు? తానే తగలబెట్టి ప్రభుత్వంపై తోసేయడమేనా 2.0? ఎన్ని కుట్రలు చేసినా సిట్ వస్తుంది గెట్ రెడీ. స్టే ట్యూన్డ్ టు తాడేపల్లి ఫైల్స్’ అని ట్వీట్ చేసింది.

Similar News

News February 6, 2025

బీసీలకు రేవంత్ అన్యాయం: ఆర్.కృష్ణయ్య

image

TG: రాష్ట్రంలోని బీసీలకు కేసీఆర్ కంటే CM రేవంత్ ఎక్కువ అన్యాయం చేస్తున్నారని బీసీ నేత ఆర్.కృష్ణయ్య విమర్శించారు. BCలకు చట్టప్రకారం 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘రాష్ట్రంలో జరిగిన కులగణనలో చాలా బీసీ కుటుంబాలు పాల్గొనలేదు. లేదంటే బీసీల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండేది. కులగణనపై చట్టం చేస్తే మేం సుప్రీంకోర్టులో పోరాడుతాం. రాజకీయాలు చేయడం మాకూ వచ్చు’ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

News February 6, 2025

కరెంట్ ఛార్జీలు పెంచేది లేదు: సీఎం

image

AP: ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కరెంట్ ఛార్జీలు పెంచేందుకు వీల్లేదని మంత్రివర్గ సమావేశంలో తేల్చి చెప్పారు. అవకాశం ఉంటే తగ్గించాలన్నారు. సూర్యఘర్, పీఎం కుసుమ్ వేగంగా అమలయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. నూతన విద్యాసంవత్సరం మొదలయ్యేలోపే డీఎస్సీ పోస్టులు భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

News February 6, 2025

‘తల్లికి వందనం’పై సీఎం కీలక ప్రకటన

image

AP: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘తల్లికి వందనం’ (స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేలు చొప్పున సాయం)పథకాన్ని అమలు చేయాలని క్యాబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఏప్రిల్‌లో మత్స్యకార భరోసా అమలు చేసేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రులకు సూచించారు. అన్నదాత సుఖీభవ విధివిధానాలపై చర్చించాలని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యత మంత్రులే తీసుకోవాలని ఆదేశించారు.

error: Content is protected !!