News February 6, 2025
విజయవాడ: గోల్కొండ, ప్యాసింజర్ రైలు రద్దు

ఈనెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గోల్కొండ, డోర్నకల్ ప్యాసింజర్ రైలు రద్దు చేస్తున్నట్లు రైల్వే ఉన్నతాధికారులు ప్రకటించారు. దీంతో 17202, సికింద్రాబాద్ నుంచి గుంటూరు, 17201 గుంటూరు నుంచి సికింద్రాబాద్ వరకు నడిచే గోల్కొండ ఎక్స్‌ప్రెస్, 67767 డోర్నకల్ నుంచి విజయవాడ వెళ్లే ప్యాసింజర్, 67768 విజయవాడ నుంచి డోర్నకల్ వెళ్లే ప్యాసింజర్ రద్దు కానున్నాయి.
Similar News
News March 16, 2026
శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు

AP: నంద్యాల(D)లోని శ్రీశైల మహా క్షేత్రంలో నేటి నుంచి 20వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి వరుసగా భృంగి, కైలాస, నంది, అశ్వ వాహన సేవలు నిర్వహిస్తారు. అమ్మవారు మహాలక్ష్మి, మహాదుర్గ, మహాసరస్వతి, రాజరాజేశ్వరి, నిజరూప అలంకారాల్లో దర్శనమిస్తారు. ఈ 5 రోజులపాటు గర్భాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
News March 16, 2026
స్త్రీనిధి రుణాలు పక్కదారి.. రూ.1.50 కోట్లు గోల్‌మాల్

వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో స్త్రీనిధి రుణాలు దారి తప్పాయి. మహిళా సంఘాల సభ్యుల నుంచి కిస్తీలు వసూలు చేసిన 50 మంది రిసోర్స్ పర్సన్లు (ఆర్‌పీలు), ఆ సొమ్మును బ్యాంకులో జమ చేయకుండా సుమారు రూ.1.50 కోట్లు సొంతానికి వాడుకున్నారు. అధికారుల నోటీసులతో అసలు విషయం బయటపడటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. బాధ్యులైన ఆర్‌పీలకు అధికారులు మెమోలు జారీ చేశారు.
News March 16, 2026
భారత్‌కు గుడ్ న్యూస్.. గ్యాస్ కష్టాలు తీరనున్నాయ్

హార్ముజ్ జలసంధిలో అడ్డంకులను దాటుకున్న శివాలిక్ నౌక గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు కొన్ని గంటల్లో చేరుకోనుంది. ఇందులో దాదాపు 40-46 వేల మెట్రిక్ టన్నుల LPG ఉంది. దీని రాకతో దేశంలో గ్యాస్ కష్టాలు కొంత వరకు తగ్గనున్నాయి. 46వేల మెట్రిక్ టన్నుల LPGతో ‘నందా దేవి’ అనే నౌక కూడా అతి త్వరలో భారత్‌కు చేరుకోనుంది. దీనికి ఇండియన్ నేవీ ఎస్కార్ట్ కల్పిస్తోంది.


