News February 6, 2025

సంపన్నులకు దోచిపెట్టేలా కేంద్ర బడ్జెట్: ఏఐటీయూసీ, సీఐటీయూ 

image

సంపన్నులకు దోచిపెట్టేలా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఉందని వరంగల్ జిల్లా ఏఐటీయూసీ, సీఐటీయూ కార్యదర్శులు ముక్కెర రామస్వామి, గన్నారం రమేష్ విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా ఆల్ ట్రేడ్ యూనియన్స్, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం వరంగల్ చౌరస్తాలో నిరసన చేపట్టి బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు. బడ్జెట్ కార్మికులు, కర్షకులు, ప్రజలకు వ్యతిరేకంగా ఉందన్నారు.

Similar News

News February 6, 2025

అద్దంకి ఎక్సైజ్ PSను తనిఖీ చేసిన సూపర్నెంట్

image

అద్దంకి ఎక్సైజ్ స్టేషన్‌ను గురువారం బాపట్ల అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్నెంట్ వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన గీత కులాల మద్యం దుకాణాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. దరఖాస్తుల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని ఆయన సిబ్బందికి సూచించారు. అలాగే ఇటీవల కాలంలో నమోదు చేసిన కేసుల వివరాలను ఆయన ఎక్సైజ్ సీఐ భవానిని అడిగి తెలుసుకున్నారు.

News February 6, 2025

NZB: రైలులోంచి పడి యువకుడు మృతి

image

రైల్లోంచి పడి గుర్తుతెలియని యువకుడు మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపారు. NZB- జానకంపేట రైల్వే స్టేషన్ మధ్యలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్లోంచి కింద పడడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712658591 నంబర్‌‌‌కు సంప్రదించాలన్నారు.

News February 6, 2025

జైభీమ్ అనడం కాదు అంబేడ్కర్‌ను అవమానించిందే కాంగ్రెస్: మోదీ

image

రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను కాంగ్రెస్ ఎప్పుడూ గౌరవించలేదని PM మోదీ అన్నారు. ఎన్నికల్లో ఆయన్ను ఓడించేందుకు అనేక కుట్రలు పన్నారని ఆరోపించారు. అందుకు ఏం చేయకూడదో అన్నీ చేశారని పేర్కొన్నారు. ఆయనకు భారతరత్న ఇవ్వకుండా అవమానించారని అన్నారు. ఇప్పుడు బలవంతంగా జైభీమ్ అంటున్నారని, బాబా సాహెబ్ ఐడియాలజీని మాత్రం ఎప్పుడూ పాటించలేదని పేర్కొన్నారు. చరిత్రలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ తప్పులే కనిపిస్తాయన్నారు.

error: Content is protected !!