News February 6, 2025

HYD: KCR రాజీనామా చేయాలా.. వద్దా..?: (VIRAL)

image

GHMC కార్పొరేటర్ ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సరూర్‌నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి‌ BRS తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ.. ‘అసెంబ్లీకి రాని, ప్రజల సమస్యలు పట్టించుకోని KCR గారు గజ్వేల్ MLAగా రాజీనామా చేయాలా..? వద్ద..?’ అని ప్రశ్నించారు. దీనిపై ఇరు పార్టీల సోషల్ యాక్టివిస్ట్‌‌లు స్పందించారు. నిజమే అని BJP శ్రేణులు.. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది ఏంటని BRS నేతలు పోటీ పడటం గమనార్హం.

Similar News

News February 6, 2025

కాంగ్రెస్‌ నుంచి సబ్‌కా వికాస్‌ను ఆశించడం కష్టమే: మోదీ

image

పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం తమలో స్ఫూర్తి నింపిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. రాజ్యసభలో ధన్యవాద తీర్మానంపై ప్రసంగిస్తూ కాంగ్రెస్‌పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. వారికి సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ఎందుకు అర్థమవ్వడం లేదో తెలియదన్నారు. వాళ్ల నుంచి సబ్‌కా వికాస్ ఆశించడం కష్టమేనన్నారు. వారికి కుటుంబమే ప్రధానమని, వారికి తెలిసిందల్లా బుజ్జగింపు రాజకీయాలని ఎద్దేవా చేశారు.

News February 6, 2025

జక్రాన్‌పల్లి: విలువైన నిషేదిత మత్తు పదార్థాల దహనం

image

నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 154 కేసులలో పట్టుబడిన రూ.12కోట్ల విలువైన నిషేదిత మత్తు పదార్థాలను జక్రాన్పల్లిలోని శ్రీ మెడికేర్‌లో గురువారం దహనం చేశారు. ఈ మేరకు డ్రగ్ డిస్పోజల్ కమిటీ అమోదించిన నిషేదిత మత్తు పదార్థాలైన 1700 కిలోల ఎండు గంజాయి, 64.27 కిలోల అల్ఫాజోలం, 72.2 కిలోల డైజీపాం, ఒక గంజాయి మొక్కను దహనం చేశారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. 

News February 6, 2025

FLIPKARTపై నెటిజన్లు ఫైర్.. ఎందుకంటే?

image

ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ‘ఫ్లిప్‌కార్ట్’పై నెట్టింట విమర్శలొస్తున్నాయి. కంపెనీ తాజాగా ‘ప్రొటెక్ట్ ప్రామిస్ ఫీ’ పేరుతో రూ.9 వసూలు చేయడంపై వినియోగదారులు ఫైరవుతున్నారు. ఈ యాప్‌లో ఇప్పటికే ప్లాట్ ఫామ్ ఫీ, హ్యాండ్లింగ్ ఫీ, సెక్యూర్ ప్యాకేజింగ్ ఫీ వసూలు చేస్తుండగా తాజాగా ప్రొటెక్ట్ ప్రామిస్ ఫీ తీసుకొచ్చారని చెబుతున్నారు. కొన్నిరోజులైతే యాప్ ఓపెన్ చేసినందుకు కూడా ఫీజు అడుగుతారేమోనంటూ సెటైర్లు వేస్తున్నారు.

error: Content is protected !!