News February 6, 2025
కామారెడ్డి: తీన్మార్ మల్లన్నను అరెస్టు చేయాలని తీర్మానం

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెంటనే అరెస్టు చేయాలని కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం యాడారం గ్రామ రెడ్డి సంఘం ప్రతినిధులు తీర్మానం చేశారు. బీబీపేట మండలం యాడారం గ్రామంలో రెడ్డి కులస్థులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రతినిధులు బాపురెడ్డి, నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అగ్రవర్ణ కులాలపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Similar News
News March 8, 2026
NZB: 246 కేసులు.. రూ 20.30 లక్షల జరిమానా: CP

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన రెండు వారాల్లో 246 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. కేసుల్లో పట్టుబడిన వారిని కోర్టుల్లో హాజరు పరచగా రూ.20.30 లక్షల జరిమానా విధించడం జరిగిందన్నారు. అలాగే 16 మందికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని CP వివరించారు.
News March 7, 2026
NZB: బార్ ఎన్నికల అధికారుల నియామాకం

నిజామాబాద్ బార్ అసోసియేషన్ 2026-27 వార్షిక ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా సీనియర్ న్యాయవాదులు ఆమీదాల సుదర్శన్, మెట్టు నరేశ్ కుమార్‌లను నియమించినట్లు బార్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్, నామినేష్ల ప్రక్రియకు సంబంధించి వివరాలు ఎన్నికల అధికారులు తెలియజేస్తారని వారు పేర్కొన్నారు.
News March 7, 2026
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన NZB కలెక్టర్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లాలోని మహిళలందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని ఆమె పేర్కొన్నారు.
మహిళలు ప్రతి రంగంలోనూ తమ ప్రతిభను చాటుకుంటూ దేశ అభివృద్ధికి కీలకంగా మారుతున్నారన్నారు. మహిళలకు భద్రత, గౌరవం, సమాన అవకాశాలు కల్పించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ గుర్తు చేశారు.


