News February 6, 2025

‘లైగర్‌’లో నటించేందుకు అనన్య ఒప్పుకోలేదు: చంకీ పాండే

image

విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమాలో నటించేందుకు తన కూతురు అనన్య పాండే అసౌకర్యంగా ఫీలైనట్లు ఆమె తండ్రి చంకీ పాండే తెలిపారు. ఆ పాత్రకు ఆమె వయసు సరిపోదని చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే తానే ఒప్పించినట్లు వెల్లడించారు. కాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘లైగర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు కరణ్ జోహర్ ఓ నిర్మాతగా వ్యవహరించారు.

Similar News

News February 6, 2025

మోసాల గురించి జగనే చెప్పాలి: మంత్రి అనగాని

image

AP: మోసాల గురించి జగన్ చెబుతుంటే ప్రజలు ఫక్కున నవ్వుతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పార్టీని బంగాళాఖాతంలో కలపడం ఖాయమని విమర్శించారు. అధికారంలో ఉండగా MLAలను కలవని జగన్, ఇప్పుడు కార్యకర్తలకు అండగా ఉంటానంటే నమ్మే పరిస్థితులు లేవని ట్వీట్ చేశారు. మరోవైపు జగన్ అధికారంలో ఉన్నప్పుడు బటన్ నొక్కి బటర్ మిల్క్ మాత్రమే ఇచ్చారని BJP MLA ఆదినారాయణరెడ్డి విమర్శించారు.

News February 6, 2025

జైభీమ్ అనడం కాదు అంబేడ్కర్‌ను అవమానించిందే కాంగ్రెస్: మోదీ

image

రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను కాంగ్రెస్ ఎప్పుడూ గౌరవించలేదని PM మోదీ అన్నారు. ఎన్నికల్లో ఆయన్ను ఓడించేందుకు అనేక కుట్రలు పన్నారని ఆరోపించారు. అందుకు ఏం చేయకూడదో అన్నీ చేశారని పేర్కొన్నారు. ఆయనకు భారతరత్న ఇవ్వకుండా అవమానించారని అన్నారు. ఇప్పుడు బలవంతంగా జైభీమ్ అంటున్నారని, బాబా సాహెబ్ ఐడియాలజీని మాత్రం ఎప్పుడూ పాటించలేదని పేర్కొన్నారు. చరిత్రలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ తప్పులే కనిపిస్తాయన్నారు.

News February 6, 2025

BREAKING: విద్యార్థులకు సూపర్ న్యూస్

image

AP: మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు ఇకపై సన్నబియ్యం అందించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’పై మంత్రివర్గం చర్చించగా.. మెనూలో తీసుకొచ్చిన మార్పులను మంత్రి లోకేశ్ వివరించారు. ప్రాంతాల వారీగా పిల్లలు ఇష్టపడి తినే ఆహారాలను మెనూలో పెట్టనున్నట్లు చెప్పారు. లోకేశ్ చేసిన సన్నబియ్యం ప్రతిపాదనకు మంత్రి నాదెండ్ల మనోహర్ సహా ఇతర మంత్రులు అంగీకారం తెలిపారు.

error: Content is protected !!