News February 6, 2025
మంచిర్యాల: షటిల్ ఆడుతూ గుండెపోటుతో అధ్యాపకుడి మృతి
మంచిర్యాల పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీ అధ్యాపకుడు బంధం బాపిరెడ్డి(50) గుండెపోటుతో ఈరోజు మరణించాడు. మృతుడి మిత్రుల వివరాల ప్రకారం.. పట్టణంలోని కాలేజీ గ్రౌండ్లో నేటి ఉదయం షటిల్ ఆడుతున్నాడు. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. అక్కడికక్కడే మరణించినట్లుగా మృతుడి మిత్రులు తెలిపారు. అధ్యాపకుడి మృతిపై కాలేజీ యాజమాన్యం, అధ్యాపకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
Similar News
News February 6, 2025
ఆదిలాబాద్: ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి
బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో RRB, SSC బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ ఫౌండేషన్ కోర్సుల ఉచిత శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థులు ఈ నెల 9లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ బీసీ అభివృద్ధి అధికారి రాజలింగు, స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ తెలిపారు. 4నెలల ఉచిత శిక్షణ, బుక్ ఫండ్, ప్రతినెల స్టైఫండ్ ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News February 6, 2025
ఆదిలాబాద్: ‘వార్షిక పరీక్షలపై ఒత్తిడికి గురికావద్దు’
సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో బీసీ స్టడీ సర్కిల్ ఆదిలాబాద్లో ఫ్రీ మెట్రిక్ వసతి గృహ పదో తరగతి విద్యార్థులకు ప్రేరణ తరగతుల కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ రాజార్షి షా పాల్గొని ప్రారంభించారు. పదోతరగతి విద్యార్థులకు వార్షికపరీక్షలకు అవసరమైన సామగ్రిని కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని సూచించారు.
News February 6, 2025
ఆదిలాబాద్: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి!
ఆదిలాబాద్ జిల్లాలోని 18 మండలాల్లో సుమారు 467 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఫిబ్రవరి 15లోగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఇటీవల పలువురు ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. ఎన్నికల బరిలో దిగేందుకు మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, నూతన అభ్యర్థులు సర్వం సిద్ధమవుతున్నారు. మీ గ్రామంలో పరిస్థితి ఎలా ఉందో కామెంట్ చేయండి.