News March 19, 2024

సమంత కొత్త సిరీస్ టైటిల్ ఫిక్స్

image

సమంత, బాలీవుడ్ నటుడు వరుణ్ ధవన్ కాంబినేషన్‌లో వస్తున్న సిరీస్‌కు టైటిల్ ఫిక్స్ అయ్యింది. ‘సిటాడెల్: హనీ-బన్నీ’(Citadel Honey Bunny) పేరుతో ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మరో బాలీవుడ్ స్టార్ ప్రియాంకా చోప్రా కీలక పాత్ర పోషించనున్నారు. రాజ్&డీకే దర్శకత్వంలో వస్తున్న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.

Similar News

News January 8, 2025

BIG BREAKING: ఇంటర్ పరీక్షల్లో సమూల మార్పులు

image

AP: ఇంటర్ పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులను ప్రతిపాదించింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను తొలగిస్తామని బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు. బోర్డు కేవలం సెకండియర్ పరీక్షలను మాత్రమే నిర్వహిస్తుందని చెప్పారు. ఈ నెల 26 వరకు విద్యార్థులు, తల్లిదండ్రుల సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. 2025-26 నుంచి ఇంటర్‌లో సైన్స్ సబ్జెక్టుల్లో NCERT సిలబస్ ప్రవేశపెడతామని తెలిపారు.

News January 8, 2025

అదానీపైనే అభియోగాలేల? ప్రశ్నించిన రిపబ్లికన్ MP

image

విదేశీ కంపెనీల దర్యాప్తులో గౌతమ్ అదానీ కంపెనీలను జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ సెలక్టివ్‌గా టార్గెట్ చేయడమేంటని రిపబ్లికన్ లామేకర్ లాన్స్ గూడెన్ ప్రశ్నించారు. అమెరికా మిత్రదేశాలతో బంధాలను సంక్లిష్టం చేయొద్దని, విదేశాల్లో వదంతులను వేటాడటం మానేసి స్వదేశంలో దారుణాలను అరికట్టాలని జస్టిస్ డిపార్ట్‌మెంటుకు సూచించారు. ఒకవేళ అదానీపై అభియోగాలు నిజమని తేలినా భారత్‌లో అమెరికా ఏం చేయగలదని ప్రశ్నించారు.

News January 8, 2025

CT: అఫ్గాన్ మెంటార్‌గా యూనిస్ ఖాన్

image

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో అఫ్గానిస్థాన్ టీమ్ మెంటార్‌గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని అఫ్గాన్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. గతంలో ఆయన అఫ్గాన్‌కు బ్యాటింగ్ కోచ్‌గానూ పనిచేశారు. ఆయనకు PSL, అబుదాబి T10 లీగ్‌లో కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఫిబ్రవరి 19న పాకిస్థాన్VSన్యూజిలాండ్ మ్యాచుతో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది.