News February 6, 2025
బీఆర్ఎస్ సర్వేపై సీఐడీ విచారణ చేపట్టాలి: షబ్బీర్ అలీ
TG: కులగణన సర్వే నివేదికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో బీఆర్ఎస్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై సీఐడీ విచారణ చేపట్టాలన్నారు. ప్రజల వివరాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్లాయని ప్రశ్నించారు. సర్వే పేరుతో రూ.100 కోట్లు దుర్వినియోగం చేశారని విమర్శించారు. విచారణ జరిగితే అన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.
Similar News
News February 6, 2025
కాంగ్రెస్ నుంచి సబ్‌కా వికాస్‌ను ఆశించడం కష్టమే: మోదీ
పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం తమలో స్ఫూర్తి నింపిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. రాజ్యసభలో ధన్యవాద తీర్మానంపై ప్రసంగిస్తూ కాంగ్రెస్‌పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. వారికి సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ఎందుకు అర్థమవ్వడం లేదో తెలియదన్నారు. వాళ్ల నుంచి సబ్‌కా వికాస్ ఆశించడం కష్టమేనన్నారు. వారికి కుటుంబమే ప్రధానమని, వారికి తెలిసిందల్లా బుజ్జగింపు రాజకీయాలని ఎద్దేవా చేశారు.
News February 6, 2025
FLIPKARTపై నెటిజన్లు ఫైర్.. ఎందుకంటే?
ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ‘ఫ్లిప్‌కార్ట్’పై నెట్టింట విమర్శలొస్తున్నాయి. కంపెనీ తాజాగా ‘ప్రొటెక్ట్ ప్రామిస్ ఫీ’ పేరుతో రూ.9 వసూలు చేయడంపై వినియోగదారులు ఫైరవుతున్నారు. ఈ యాప్‌లో ఇప్పటికే ప్లాట్ ఫామ్ ఫీ, హ్యాండ్లింగ్ ఫీ, సెక్యూర్ ప్యాకేజింగ్ ఫీ వసూలు చేస్తుండగా తాజాగా ప్రొటెక్ట్ ప్రామిస్ ఫీ తీసుకొచ్చారని చెబుతున్నారు. కొన్నిరోజులైతే యాప్ ఓపెన్ చేసినందుకు కూడా ఫీజు అడుగుతారేమోనంటూ సెటైర్లు వేస్తున్నారు.
News February 6, 2025
పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తే కఠిన చర్యలు: CLP
TG: పార్టీ విధానాలను సొంత పార్టీ నేతలే తప్పుపడుతుండటంపై కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (CLP) మీటింగ్‌లో నేతలు చర్చలు జరిపారు. పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించే వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తుంటే ప్రజల్లోకి చెడు సంకేతాలు వెళ్తాయని, ఏవైనా విభేదాలుంటే అంతర్గతంగా చర్చించుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించినట్లు సమాచారం.