News February 6, 2025

మంచిర్యాల: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి!

image

మంచిర్యాల జిల్లాలోని 18 మండలాల్లో సుమారు 362 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఫిబ్రవరి 15లోగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఇటీవల పలువురు ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. ఎన్నికల బరిలో దిగేందుకు మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, నూతన అభ్యర్థులు సర్వం సిద్ధమవుతున్నారు. మీ గ్రామంలో పరిస్థితి ఎలా ఉందో కామెంట్ చేయండి.

Similar News

News February 6, 2025

INDvsENG మ్యాచులో ‘పుష్ప’

image

నాగ్‌పూర్‌లోని విదర్భ స్టేడియం వేదికగా జరుగుతోన్న INDvsENG తొలి వన్డే మ్యాచ్‌కు భారీగా అభిమానులు తరలివచ్చారు. ఇందులో ఓ వ్యక్తి ‘పుష్ప-2’ సినిమాలో హీరో అల్లు అర్జున్ గంగమ్మ జాతర సాంగ్‌లో వేసిన గెటప్‌తో దర్శనమిచ్చాడు. పుష్ప ఫీవర్ నాగ్‌పూర్‌ను తాకిందంటూ నెటిజన్లు ఈ ఫొటోను షేర్ చేస్తున్నారు. అయితే, అతనికి ఈ గెటప్ సూట్ కాలేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అతడెలా ఉన్నాడో కామెంట్ చేయండి.

News February 6, 2025

శ్రీ సత్యసాయి జిల్లా మంత్రులకు సీఎం ర్యాంకులు

image

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రుల పనితీరుపై సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో శ్రీ సత్యసాయి జిల్లా మంత్రులు సత్యకుమార్ యాదవ్ 7, సవిత 11వ ర్యాంకు పొందారు. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సూచించారు.

News February 6, 2025

మా అభ్యర్థులకు బీజేపీ రూ.15 కోట్లు ఆఫర్ చేసింది: ఆప్ నేత

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఏడుగురు ఆప్ అభ్యర్థులను కొనుగోలు చేసేందుకు బీజేపీ కుట్రలు చేసిందని ఆప్ నేత సంజయ్ సింగ్ ఆరోపించారు. పోలింగ్ ముగియగానే బీజేపీ నుంచి సదరు అభ్యర్థులకు కాల్స్ వచ్చాయని, ఒక్కొక్కరికి రూ.15 కోట్లు ఆఫర్ చేశారని పేర్కొన్నారు. కానీ ఆప్ అభ్యర్థులు ఆ ఆఫర్‌ను తిరస్కరించారని చెప్పారు. ఓడిపోతామని తెలిసే బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని సింగ్ మండిపడ్డారు.

error: Content is protected !!