News February 6, 2025
‘భక్త ప్రహ్లాద’కు 93 ఏళ్లు
తెలుగులో తొలి టాకీ సినిమాగా గుర్తింపు పొందిన ‘భక్త ప్రహ్లాద’ విడుదలై నేటికి 93 ఏళ్లు పూర్తయ్యాయి. హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను రూ.18 వేలతో 18 రోజుల్లోనే తెరకెక్కించారు. అప్పటివరకు మూకీ చిత్రాలకే అలవాటైన జనాలకు ఇది కొత్త అనుభవాన్ని ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో పెను మార్పులు చోటుచేసుకొని అంతర్జాతీయ వేదికపై సత్తాచాటే స్థాయికి చేరుకున్నాయి.
Similar News
News February 6, 2025
జైభీమ్ అనడం కాదు అంబేడ్కర్‌ను అవమానించిందే కాంగ్రెస్: మోదీ
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను కాంగ్రెస్ ఎప్పుడూ గౌరవించలేదని PM మోదీ అన్నారు. ఎన్నికల్లో ఆయన్ను ఓడించేందుకు అనేక కుట్రలు పన్నారని ఆరోపించారు. అందుకు ఏం చేయకూడదో అన్నీ చేశారని పేర్కొన్నారు. ఆయనకు భారతరత్న ఇవ్వకుండా అవమానించారని అన్నారు. ఇప్పుడు బలవంతంగా జైభీమ్ అంటున్నారని, బాబా సాహెబ్ ఐడియాలజీని మాత్రం ఎప్పుడూ పాటించలేదని పేర్కొన్నారు. చరిత్రలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ తప్పులే కనిపిస్తాయన్నారు.
News February 6, 2025
BREAKING: విద్యార్థులకు సూపర్ న్యూస్
AP: మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు ఇకపై సన్నబియ్యం అందించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’పై మంత్రివర్గం చర్చించగా.. మెనూలో తీసుకొచ్చిన మార్పులను మంత్రి లోకేశ్ వివరించారు. ప్రాంతాల వారీగా పిల్లలు ఇష్టపడి తినే ఆహారాలను మెనూలో పెట్టనున్నట్లు చెప్పారు. లోకేశ్ చేసిన సన్నబియ్యం ప్రతిపాదనకు మంత్రి నాదెండ్ల మనోహర్ సహా ఇతర మంత్రులు అంగీకారం తెలిపారు.
News February 6, 2025
టెస్టు క్రికెట్‌లో అరుదైన సంఘటన
టెస్టు క్రికెట్‌లో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. అరంగేట్ర మ్యాచులోనే కెప్టెన్సీ చేసిన ప్లేయర్‌గా జింబాబ్వేకు చెందిన జోనథన్ క్యాంప్‌బెల్ చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు మరే ప్లేయర్ తన తొలి మ్యాచులోనే జట్టుకు నాయకత్వం వహించలేదు. ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచులో రెగ్యులర్ కెప్టెన్ క్రెగ్ ఇర్విన్ వ్యక్తిగత కారణాలతో అనూహ్యంగా మ్యాచ్ నుంచి తప్పుకున్నారు. దీంతో క్యాంప్‌బెల్ జట్టు పగ్గాలు అందుకున్నారు.