News February 6, 2025

కొమురంభీమ్: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి!

image

కొమురంభీమ్ జిల్లాలోని 15 మండలాల్లో సుమారు 402 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఫిబ్రవరి 15లోగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఇటీవల పలువురు ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. ఎన్నికల బరిలో దిగేందుకు మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, నూతన అభ్యర్థులు సర్వం సిద్ధమవుతున్నారు. మీ గ్రామంలో పరిస్థితి ఎలా ఉందో కామెంట్ చేయండి.

Similar News

News February 6, 2025

మంత్రి సంధ్యారాణికి 19వ ర్యాంక్

image

సీఎం చంద్రబాబు మంత్రులకు గురువారం ర్యాంకులు ప్రకటించారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఈ ర్యాంకుల్లో పార్వతీపురం మన్యం జిల్లా మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి 19వ ర్యాంక్ వచ్చింది. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సీఎం మంత్రికి సూచించారు.

News February 6, 2025

రాహుల్, ఖర్గేలతో భారీ సభలు: TPCC చీఫ్

image

TG: ఈ నెలాఖరులోగా రెండు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. సూర్యాపేటలో కులగణనపై రాహుల్ గాంధీతో, ఎస్సీ వర్గీకరణపై మెదక్‌లో ఖర్గేతో బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. ‘స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై చర్చించాం. సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని, కులగణనపై దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని నేతలకు సూచించాం’ అని పేర్కొన్నారు.

News February 6, 2025

ఫైళ్ల క్లియరెన్స్.. నిమ్మలకు 22వ ర్యాంకు

image

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో ప.గో జిల్లా మంత్రి నిమ్మల రామానాయుడు 22వ ర్యాంకు పొందారు. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సూచించారు.

error: Content is protected !!