News February 6, 2025

నిర్మల్: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి!

image

నిర్మల్ జిల్లాలోని 19 మండలాల్లో సుమారు 396 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఫిబ్రవరి 15లోగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఇటీవల పలువురు ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. ఎన్నికల బరిలో దిగేందుకు మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, నూతన అభ్యర్థులు సర్వం సిద్ధమవుతున్నారు. మీ గ్రామంలో పరిస్థితి ఎలా ఉందో కామెంట్ చేయండి.

Similar News

News March 29, 2026

NZB: బహిరంగ క్షమాపణ చెప్పిన కవిత

image

బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయినందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బహిరంగ క్షమాపణ చెప్పారు. ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ధర్నాకు కవిత మద్దతు ఇచ్చారు. ఆనాటి ప్రభుత్వ పాపంలో తనకు భాగం ఉందని తనను క్షమించాలని కోరారు. వెంటనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

News March 29, 2026

పాలమూరు: లోక్ అదాలత్..UPDATE!!

image

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా వివిధ కోర్టుల పరిధిలో ఉన్న మొత్తం 3,416 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి పేర్కొన్నారు. ఐపీసీ (IPC) కేసులు-524, డీడీ (DD) కేసులు – 794, ఈపెట్టీ (e-Petty) కేసులు – 1,979 సైబర్ క్రైమ్ కేసులు-119 ఈ కేసుల పరిష్కారంతో బాధితులకు తక్షణ న్యాయం అందించడంతో పాటు, కోర్టులపై ఉన్న భారం కూడా తగ్గినట్లు ఎస్పీ వెల్లడించారు.

News March 29, 2026

NZB: ఆరుగురికి వారం రోజుల చొప్పున జైలు

image

డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ఆరుగురికి ఒక్కొక్కరికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధించారు. నిజామాబాద్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ హైమద్ మొయినుద్దీన్ తీర్పు వెల్లడించారని NZB ట్రాఫిక్ CI పబ్బ ప్రసాద్ తెలిపారు. అలాగే 35 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.3.50 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.