News February 6, 2025

కోడేరులో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య

image

కోడేరు మండల కేంద్రంలోనికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం రాత్రి జరిగింది. కుటుంబసభ్యుల కథనం మేరకు.. చిన్నరాజు రాత్రి తమతో కలిసి పడుకున్నాడు. తెల్లారేసరికి ఉరేసుకుని కనిపించటంతో వారు చుట్టపక్కల వారిని పిలిచారు. స్థానికులు మృతదేహాన్ని కిందికి దించారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. మృతుడికి భార్య కళమ్మ, కుమారుడు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 26, 2026

NGKL: జీవన్ రెడ్డి పార్టీ విడిపోవడం బాధాకరం: ఎంపీ

image

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ విడిపోవడం ఎంతో బాధాకరమని నాగర్‌కర్నూల్ డాక్టర్ మల్లు రవి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీలో కొనసాగి అడగాలి తప్ప పార్టీ మారడం సరైనది కాదని అన్నారు. కొన్ని రాజకీయ సమీకరణల వల్ల అందరికీ పదవులు రావని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గొప్ప సిద్ధాంతాలు ఉన్న పార్టీ అని గుర్తు చేశారు. ఇలాంటి పార్టీ దేశంలో ఇంకొకటి లేదన్నారు.

News March 26, 2026

గంగవరం: బైక్‌లు ఢీకొని వ్యక్తి మృతి

image

రెండు బైక్‌లు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన గంగవరం మండలంలో జరిగింది. ఓ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు జుబేర్, శ్రీధర్ బైక్‌పై పలమనేరుకు బయలుదేరారు. మేలుమయి గ్రామానికి చెందిన దొరస్వామి (55) పలమనేరు నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. మేలు మయి క్రాస్ వద్ద వీరి వాహనాలు ఢీకొన్నాయి. సీఎంసీకి తరలిస్తుండగా దొరసామి మృతి చెందారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 26, 2026

పెట్రోల్ సమస్య.. వారికి వర్క్ ఫ్రమ్ హోమ్!

image

హైదరాబాద్‌లో పెట్రోల్ సమస్యతో కొన్ని IT కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని మొదలుపెట్టాయి. విప్రో, యాక్సెంచర్, TCS వంటి పెద్ద కంపెనీలు ఇంటి నుంచి పని చేసే అవకాశాన్ని కల్పిస్తుండగా, మరికొన్ని సంస్థలు 50-50 విధానం తీసుకొచ్చాయి. దీంతో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ తగ్గే అవకాశం ఉంది. HYDలో దాదాపు 9.5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా అందులో సగం మంది బైకులు, కార్లలో రాకపోకలు సాగిస్తారని సమాచారం.