News March 19, 2024

సెల్యూట్.. చనిపోతూ ముగ్గురిని కాపాడాడు

image

కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సమయంలో అవయవాలు దొరక్క ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు. అవయవదానంపై ఎంత అవగాహన కల్పించినా ప్రజలు ముందుకు రావడం లేదు. అయితే, తాజాగా తెలంగాణకు చెందిన ప్రభాస్ అనే 19 ఏళ్ల యువకుడు తాను చనిపోతూ ఇతరులకు ప్రాణదానం చేశారు. ప్రభాస్ చనిపోవడంతో అతడి 2 కిడ్నీలు, లివర్‌ను కుటుంబీకులు దానం చేసి మరో ముగ్గురిని కాపాడారు. ఈ విషయాన్ని ‘జీవన్‌దాన్ తెలంగాణ’ ట్వీట్ చేసింది.

Similar News

News August 28, 2025

US టారిఫ్స్‌కు GSTతో చెక్: BMI

image

ఇండియాపై US టారిఫ్స్ ప్రభావం పరిమితమేనని బిజినెస్ మానిటర్ ఇంటర్నేషనల్ అభిప్రాయపడింది. ‘ఈ దశాబ్దం చివరికి IND GDP 6%పైనే ఉంటుంది. 2010-19 యావరేజ్(6.5%)తో పోలిస్తే కొంతే తక్కువ. అయినా ASIAలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీస్‌లో INDనే టాప్. GST 2శ్లాబుల విధానం, ఆదాయపన్ను కోతలతో కొనుగోళ్లు రూ.5.31 లక్షల కోట్లకు చేరుతాయని SBI అంచనా. ఇవన్నీ గ్రోత్‌పై టారిఫ్స్‌ ప్రభావాన్ని తగ్గిస్తాయి’ అని తెలిపింది.

News August 28, 2025

బీస్ట్ మోడ్‌లో సంజూ శాంసన్.. మరో ఫిఫ్టీ

image

KCLలో కొచ్చి బ్లూ టైగర్స్‌ ప్లేయర్ సంజూ శాంసన్ మరోసారి రెచ్చిపోయారు. అదానీ త్రివేండ్రం రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచులో సంజూ మరో ఫిఫ్టీ బాదారు. 37 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 62 పరుగులు సాధించారు. కాగా అంతకుముందు త్రిస్సూర్ టైటాన్స్‌పై 89, కొల్లం సెయిలర్స్‌పై 121 పరుగులు బాదిన విషయం తెలిసిందే. తాజా ఫామ్‌తో శాంసన్ టీమ్ ఇండియా ఓపెనర్ స్థానానికి గట్టి పోటీ ఇస్తున్నారు.

News August 28, 2025

టారిఫ్స్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్స్

image

అమెరికా టారిఫ్స్ అమల్లోకి రావడంతో వరుసగా రెండో రోజు కూడా భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. ఇవాళ Sensex 705 పాయింట్లు నష్టపోయి 80,080 వద్ద, Nifty 211 పాయింట్ల నష్టంతో 24,500 వద్ద స్థిరపడ్డాయి. శ్రీరామ్ ఫైనాన్స్, HCL టెక్, TCS, ఇన్ఫోసిస్, HDFC, ICICI, ఇండస్ ఇండ్, ఎయిర్టెల్ షేర్లు నష్టపోయాయి. టైటాన్, లార్సెన్, హీరో మోటోకార్ప్, ఏషియన్ పెయింట్స్, మారుతీ సుజుకీ షేర్లు లాభపడ్డాయి.