News February 6, 2025

కేసముద్రం: రైలు నుంచి జారి పడి విద్యార్థికి తీవ్ర గాయాలు

image

రైలు నుంచి జారి పడి విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కేసముద్రం మండలం ఇంటికన్నె రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల మేరకు.. పరకాలకు చెందిన అరవింద్ అనే యువకుడు శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడ్డాడు. దీంతో అరవింద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Similar News

News April 17, 2026

ADB: కేసీఆర్ ‘జైత్రయాత్ర’.. మారనున్న సమీకరణాలు..?

image

ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించనున్న ‘జైత్రయాత్ర’ బహిరంగ సభతో రాజకీయ సమీకరణాలను మార్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. కేసీఆర్ సమక్షంలో సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీలో చేరనున్నారు. నియోజకవర్గాల పునర్విభజన సాకుతో కాంగ్రెస్, బీజేపీ అసంతృప్త నేతలను ఆకర్షించడంపై గులాబీ దళం దృష్టి పెట్టింది. జీవన్ రెడ్డి చేరికతో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో పార్టీ బలోపేతానికి వ్యూహరచన చేస్తోంది.

News April 17, 2026

ఈ నెల 22న టీయూలో అన్యువల్ డే

image

తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఈనెల 22న అన్యువల్ డే నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి శుక్రవారం సర్క్యులర్ జారీ చేశారు. బోధన, బోధనేతర సిబ్బంది తెలంగాణ విశ్వవిద్యాలయ అన్యువల్ డేకి హాజరుకావాలని ఆదేశించారు. సంవత్సరంలో జరిగిన ప్రగతిని నివేదించడంతో పాటు విద్యార్థుల ప్రతిభను గుర్తించి, విద్యార్థుల భవిష్యత్తుపై మార్గ నిర్దేశం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

News April 17, 2026

TU: పాలకమండలి సభ్యుడిని అభినందించిన TUTA

image

తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలిలో బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం ప్రొఫెసర్ ఆంజనేయులును ప్రభుత్వం నియమించింది. తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (TUTA) ఆయన్ను శుక్రవారం అభినందించింది. ప్రొఫెసర్ ఆంజనేయులు మాట్లాడుతూ.. యూనివర్సిటీ అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన వర్సిటీ ఉపకులపతి ఆచార్య యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరిలకు కృతజ్ఞతలు తెలిపారు.