News February 6, 2025
కూకట్‌పల్లి-నిజాంపేటలో హైడ్రా కూల్చివేతలు.. క్లారిటీ

కూకట్‌పల్లి-నిజాంపేట రోడ్డులోని హోలిస్టిక్ ఆసుపత్రి వెనుక ప్రభుత్వ స్థలం చుట్టూ నిర్మించిన ప్రహరీని బుధవారం హైడ్రా తొలగించింది. ‘300ల గజాల ఇంటి స్థలం కబ్జాకు గురైందని ఓ మాజీ సైనికుడు ఫిర్యాదు చేశారు. విచారణ చేయగా దాదాపు 1253 గజాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు తేలింది. దీంతో కబ్జా చేసిన స్థలం చుట్టూ నిర్మించిన ప్రహరీని హైడ్రా తొలగించింది’ అని అధికారులు స్పష్టం చేశారు.
Similar News
News September 14, 2025
రేపు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ఈ నెల 15న సోమవారం ఉదయం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్. రామ సుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉండాలన్నారు.
News September 14, 2025
ఉగ్రస్థావరాల పునరుద్ధరణకు సాయం.. పాక్ వక్రబుద్ధి!

పాక్ మరోసారి వక్రబుద్ధి చాటుకుంది. ఇటీవల భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన వారిని ఆదుకునేందుకు నిధులను సేకరించింది. అయితే వాటిని బాధితులకు పంచకుండా ఆపరేషన్ సిందూర్‌లో ధ్వంసమైన లష్కరే తోయిబా(LeT) ఉగ్రస్థావరాల పునరుద్ధరణకు మళ్లించింది. అంతకుముందు LeTకి పాక్ రూ.1.25 కోట్లు మంజూరు చేసింది. పునరుద్ధరణకు మొత్తం రూ.4.7 కోట్లు ఖర్చవుతుందని, పాక్ ఆ నిధుల సేకరణలో నిమగ్నమైందని భారత నిఘా వర్గాలు తెలిపాయి.
News September 14, 2025
జూబ్లీహిల్స్‌లో ప్రజలతో మంత్రుల ముఖాముఖీ

జూబ్లీహిల్స్‌లోని సోమాజిగూడ డివిజన్‌లో జయ ప్రకాశ్ కాలనీ, ఇంజినీర్స్ కాలనీ ప్రజలతో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావు ముఖాముఖీ నిర్వహించారు. రోడ్లు, డ్రైనేజీలు, పలు సమస్యలు స్థానికులు మంత్రికి తెలిపారు. వారు మాట్లాడుతూ.. అధికారులతో మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. సమస్యల వినతులపై పరిష్కారం చేస్తామన్నారు.