News February 6, 2025

వెల్దండ: ఆరాధ్య మృతిపై కుటుంబ సభ్యుల ఆందోళన

image

వెల్దండ మండలంలోని చొక్కన్నపల్లి గ్రామానికి చెందిన ఆరాధ్య ఆత్మహత్యకు పాల్పడడంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలు చెందుతున్నారు. బాలనగర్ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఆరాధ్య ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడడంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన జిల్లాలో సంచలనం రేపింది. ఆరాధ్య మృతిపై న్యాయ విచారణ జరిపించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Similar News

News March 21, 2026

ఇంద్రవెల్లిలో రేపు రగల్ జెండా అత్యవసర సమావేశం

image

ఇంద్రవెల్లిలోని రగల్ జెండా భవనంలో ఆదివారం ఆదివాసీల అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు రగల్ జెండా కమిటీ ఛైర్మన్ తొడసం నాగోరావ్ తెలిపారు. ఇంద్రవెల్లి ఆదివాసీ అమరవీరుల ఆశయ సాధన కోసం ఏప్రిల్ 20న నిర్వహించే కార్యక్రమంపై చర్చించనున్నామన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ ఉద్యమకారులు, నాయకులు హాజరుకావాలని ఆయన కోరారు.

News March 21, 2026

పాక్‌ క్రికెట్‌లో టాక్సిక్ వర్క్ కల్చర్: గ్యారీ కిర్‌స్టెన్

image

పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ తీవ్ర విమర్శలు చేశారు. బోర్డులో ఇతరుల జోక్యం, టాక్సిక్ వర్క్ కల్చర్ ఉంటుందని చెప్పారు. ఇలాంటి పరిస్థితిని తానెక్కడా చూడలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్‌కు కోచింగ్ సిబ్బందిని బలిపశువులను చేస్తారన్నారు. వృత్తిపరమైన గౌరవం లేకపోవడంతో రిజైన్ చేసినట్లు తెలిపారు. కాగా ఆయన APR 15న శ్రీలంక కోచ్‌గా బాధ్యతలు <<19339760>>చేపట్టనున్నారు.<<>>

News March 21, 2026

వనపర్తి: అగ్నివీర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం!

image

భారత సైన్యంలో 2027 సంవత్సరానికి గానూ ‘అగ్నివీర్’ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభమైనట్లు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 1వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గరిష్ఠ వయోపరిమితిని 21 నుంచి 22 ఏళ్లకు పెంచినట్లు ఆయన పేర్కొన్నారు.

దరఖాస్తుకు వెబ్‌సైట్:
www.joinindianarmy.nic.in