News February 6, 2025
కొండపాక: సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌ను తనిఖీ చేసిన కలెక్టర్
కొండపాక మండలంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌ను కలెక్టర్ మిక్కిలినేని మనూచౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్‌లోని బియ్యం, నిత్యావసర వస్తువులు, వంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠాలు బోధించారు. నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని అధికారులకు సూచించారు.
Similar News
News February 6, 2025
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న జబర్దస్త్ నటులు
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్నను గురువారం జబర్దస్త్ నటులు సుడిగాలి సుధీర్, రాంప్రసాద్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు మహా మండపంలో వేదోచ్చరణతో స్వాగతం పలికి, శేష వస్త్రంతో సత్కరించి, లడ్డు ప్రసాదం అందజేశారు. అంజన్నను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని వారు అన్నారు
News February 6, 2025
కాకినాడ జిల్లా ప్రజలకు ముఖ్య సమాచారం
గుండెపోటు వస్తే రూ.45 వేల విలువైన ఇంజెక్షన్‌ను ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా వేస్తారని కాకినాడ కలెక్టర్ షాన్‌మోహన్ వెల్లడించారు. సంబంధిత వాల్ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఇంజెక్షన్ దొరికే ఆసుపత్రుల వివరాలు ఇవే.
➤ తాళ్లరేవు ➤ సామర్లకోట ➤ తుని ➤ పెదపూడి
➤ ప్రత్తిపాడు ➤ ఏలేశ్వరం ➤ పెద్దాపురం
➤జగ్గంపేట ➤ పిఠాపురం ➤ రౌతులపూడి
News February 6, 2025
ఓర్వకల్లు దగ్గర ప్రమాదం.. ఇద్దరు మృతి
కర్నూలు జిల్లాలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓర్వకల్లు వద్ద ట్రాక్టర్, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. మృతులు జానకి(60), విహారిక(4)గా గుర్తించారు. తిరుమల దర్శనం చేసుకుని తిరిగి రాయచూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.