News February 6, 2025
BREAKING: NZB: ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రికల్ ఆటో దగ్ధం

ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రికల్ ఆటో దగ్ధమైన ఘటన నిజామాబాద్ నగరంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. నగరంలోని ధర్మపురి హిల్స్‌కు చెందిన మొహమ్మద్ మొహియుద్దీన్ బుధవారం రాత్రి తన ఎలక్ట్రిక్ ఆటోను ఇంటి ఆవరణలో ఛార్జింగ్ పెట్టి ఇంట్లోకి వెళ్లాడు. గంట వ్యవధిలో ఒక్కసారిగా ఆటోలో నుంచి మంటలు చెలరేగాయి. దీంతో ఎలక్ట్రిక్ ఆటో పూర్తిగా దగ్ధమైంది.
Similar News
News January 12, 2026
నిజామాబాద్: బీసీ స్టడీ సర్కిల్‌కు సొంత భవనం నిర్మించండి

నిజామాబాద్‌లోని ప్రభుత్వ బీసీ స్టడీ సర్కిల్ మంచి ఫలితాలు సాధిస్తుంది. కానీ అద్దె భవనంలో కొనసాగడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బీసీ స్టడీ సర్కిల్‌కు సొంతభవనం నిర్మించాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరాల సుధాకర్ కోరారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌ను ఆదివారం వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా మరో రెండు ప్రభుత్వ కాలేజీ హాస్టళ్లను మంజూరు చేయాలని కోరారు.
News January 11, 2026
NZB: అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: CP

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పేకాట, కోడిపందెలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని CP సాయి చైతన్య హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు.
News January 11, 2026
నిజామాబాద్: మందు బాబులపై ఉక్కుపాదం..!

NZB జిల్లాలో మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. 5 రోజుల్లో నిర్వహించిన తనిఖీల్లో దొరికిన 232 మందిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రూ. 22.40 లక్షల జరిమానా విధించింది. వీరిలో 6గురికి జైలు శిక్ష పడింది. ‘ఒక్కసారి దొరికితే రూ.10 వేల జరిమానా’ తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆదివారం, పండుగ వేళల్లో విందులు చేసుకునే వారు వాహనాలు నడపరాదని పోలీసులు సూచిస్తున్నారు.


