News February 6, 2025

BREAKING: NZB: ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రికల్ ఆటో దగ్ధం

image

ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రికల్ ఆటో దగ్ధమైన ఘటన నిజామాబాద్ నగరంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. నగరంలోని ధర్మపురి హిల్స్‌కు చెందిన మొహమ్మద్ మొహియుద్దీన్ బుధవారం రాత్రి తన ఎలక్ట్రిక్ ఆటోను ఇంటి ఆవరణలో ఛార్జింగ్ పెట్టి ఇంట్లోకి వెళ్లాడు. గంట వ్యవధిలో ఒక్కసారిగా ఆటోలో నుంచి మంటలు చెలరేగాయి. దీంతో ఎలక్ట్రిక్ ఆటో పూర్తిగా దగ్ధమైంది.

Similar News

News February 6, 2025

ప్రియాంక గాంధీని కలిసిన పెద్దపల్లి ఎంపీ

image

కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీని పెద్దపల్లి ఎంపీ గడ్డ వంశీకృష్ణ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, యువతకు ఉపాధి అవకాశాలు, ప్రత్యేక నిధుల కేటాయింపుల గురించి ప్రియాంక గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని నిధులు రాబట్టేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

News February 6, 2025

తెలుగులోనూ జీవోలు.. ఇలా చూసేయండి!

image

AP: రాష్ట్ర ప్రభుత్వం అధికార సైట్‌లో ఇంగ్లిష్‌తో పాటు తెలుగులో జీవోలను అప్‌లోడ్ చేస్తోంది. <>https://goir.ap.gov.in<<>> లోకి వెళ్లి వ్యవసాయం, విద్య, ఆర్థిక, మున్సిపల్, రవాణా ఇలా అన్ని శాఖలకు సంబంధించిన జీవోలను తెలుగులో చూడొచ్చు.

News February 6, 2025

స్కూల్‌లో ఫైర్.. 17 మంది చిన్నారులు సజీవదహనం

image

నైజీరియాలోని ఓ పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. జంఫారా స్టేట్ కైరా నమోదాలోని ఓ ఇస్లామిక్ స్కూల్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బడిలో 100 మంది విద్యార్థులు ఉన్నారు. స్కూల్ పక్కనే నిల్వ ఉంచిన కర్రలకు మంటలు అంటుకుని ప్రమాదం సంభవించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

error: Content is protected !!