News February 6, 2025
నాగేశ్వరరావు మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి: మాజీ ఎమ్మెల్యే
కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన కుమ్మరి నాగేశ్వరరావు మరణానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. గురువారం వరంగల్ ఎంజీఎం మార్చురీ వద్ద సుదర్శన్ రెడ్డి మృతుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నాగేశ్వరరావు కుటుంబానికి బీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. ఆయన వెంట ములుగు జిల్లా బీఆర్ఎస్ నాయకులు భూక్యా జంపన్న ఉన్నారు.
Similar News
News February 6, 2025
చిట్యాల వద్ద రోడ్డుప్రమాదం.. యువకుడి మృతి
చిట్యాల మండలం వెలిమినేడు శివారులో రోడ్డుప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. కర్ణాటక రాయచూర్ నుంచి విజయవాడకు హినప్ప రాజు (22) తన స్నేహితులతో వెళ్తున్నాడు. బైక్ అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో హినప్ప రాజు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News February 6, 2025
VZM: ‘క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి’
క్షేత్రస్థాయిలో వైద్యారోగ్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా వైద్యాధికారిణి జీవన రాణి సూచించారు. వైద్య శాఖ కార్యాలయంలో జిల్లాలో పీహెచ్సీ, సీహెచ్సీ వైద్యులతో గురువారం సమీక్ష నిర్వహించారు. మాతృ సేవలు, జేఎస్ వై, పీఎం మాతృ సురక్ష అభియాన్, తదితర కార్యక్రమాలపై చర్చించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే శత శాతం ప్రసవాలు అయ్యేలా చూడాలని సిబ్బందికి సూచించారు.
News February 6, 2025
రేపు వైసీపీలోకి శైలజానాథ్
AP: మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో చేరనున్నారు. ఇటీవల ఆయన జగన్‌తో భేటీ కాగా చేరికకు వైసీపీ చీఫ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రేపు ఉ.10 గంటలకు తాడేపల్లిలో శైలజానాథ్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. శైలజానాథ్ అనంతపురం జిల్లా శింగనమల నుంచి 2 సార్లు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా పని చేశారు.