News February 6, 2025
గచ్చిబౌలిలో కాల్పులు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్ (UPDATE)

గచ్చిబౌలి ప్రీజం పబ్ కాల్పుల కేసులో మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం సాఫ్ట్వేర్ ఇంజినీర్ రంజిత్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్‌ను అరెస్టు చేశారు. అతడికి ఆశ్రయం ఇచ్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రభాకర్ చోరీ చేసిన డబ్బును రంజిత్ బ్యాంకు ఖాతాలో జమ చేసేవాడని పోలీసులు వెల్లడించారు.
Similar News
News September 17, 2025
హైదరాబాద్‌లో 50 మంది CIల బదిలీ

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇన్స్పెక్టర్ల బదిలీలు, పదోన్నతులు జరిగాయి. తాజాగా కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. 50 మంది ఇన్స్పెక్టర్లకు బదిలీ, పదోన్నతి ఇచ్చినట్లు వెల్లడించారు. చాలా రోజుల నుంచి ఒకే పోస్టింగ్‌లో ఉన్న వారిని సైతం ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేశారు.
News September 17, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారతీయ జవాన్ కిసాన్ పార్టీ పోటీ

త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారతీయ జవాన్ కిసాన్ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ నేషనల్ కో-ఆర్డినేటర్ ఎస్ మోహన్ రావు తెలిపారు. మంగళవారం బషీర్‌బాగ్‌లో పార్టీ అభ్యర్థిగా సీనియర్ నేత జెన్ని మహంతి శ్రీనివాస్ పోటీ చేస్తారని చెప్పారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అవినీతి లేని సమాజ నిర్మాణమే తమ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు.
News September 16, 2025
రక్షణ శాఖ మంత్రికి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. రేపు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. అనంతరం పికెట్ గార్డెన్లో అటల్ బిహారీ వాజపేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.