News February 6, 2025
గచ్చిబౌలిలో కాల్పులు.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అరెస్ట్ (UPDATE)

గచ్చిబౌలి ప్రీజం పబ్ కాల్పుల కేసులో మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రంజిత్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్‌ను అరెస్టు చేశారు. అతడికి ఆశ్రయం ఇచ్చిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రభాకర్ చోరీ చేసిన డబ్బును రంజిత్ బ్యాంకు ఖాతాలో జమ చేసేవాడని పోలీసులు వెల్లడించారు.
Similar News
News April 18, 2026
MNCL: రేపు మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షకు.. ఏర్పాట్లు పూర్తి

జిల్లాలో ఈ నెల 19న జరగనున్న తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంచిర్యాల డీఈవో యాదయ్య తెలిపారు. 6వ తరగతికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, 7 నుంచి 10వ తరగతులలో మిగులు సీట్లకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు హాల్ టికెట్‌లను telanganams.cgg.gov.in నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.
News April 18, 2026
ADB: TIMలకు నెట్‌వర్క్ సెగ

ఆర్టీసీలో ప్రవేశపెట్టిన టికెట్ ఇష్యూయింగ్ మిషన్లకు (TIM)నెట్‌వర్క్ సమస్యలు శాపంగా మారాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో సెల్ టవర్లు లేక యంత్రాలు పనిచేయకపోవడంతో కండక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కటాఫ్ పాయింట్లలోపు టికెట్లు జారీ చేయలేక, తనిఖీ అధికారులకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. ఏజెన్సీల్లో గతంలో మాదిరిగా ముద్రిత టికెట్లు అందుబాటులో ఉంచాలని సిబ్బంది కోరుతున్నారు.
News April 18, 2026
ASF: జాతీయ లోక్ అదాలత్.. జూన్ 20కు మార్పు

తెలంగాణ రాష్ట్ర సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మే 9న నిర్వహించాల్సిన జాతీయ లోక్ అదాలత్‌ను జూన్ 20వ తేదీకి వాయిదా వేసినట్లు ఆసిఫాబాద్ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి తెలిపారు. మే 7వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు వేసవి సెలవులు ఉండటంతో లోక్ అదాలత్ నిర్వహణ తేదీని మార్పు చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రజలు ఈ మార్పును గమనించి సహకరించాలన్నారు.


