News February 6, 2025
2009 నుంచి అక్రమ వలసదారులు ఎందరు వచ్చారంటే: జైశంకర్

అమెరికాతో ఎవరికీ లేని విధంగా మనకు పౌరులను వెనక్కి తీసుకొచ్చే ఒప్పందం ఉందని EAM జైశంకర్ అన్నారు. అక్కడ అక్రమంగా ఉంటున్నవారిని ఇక్కడికి పంపించడం ఇదే తొలిసారి కాదన్నారు. 2009 నుంచి 2025 వరకు వరుసగా 734, 799, 597, 530, 550, 591, 708, 1303, 1024, 1180, 2042, 1889, 805, 862, 670, 1368, 104 మందిని పంపినట్టు వెల్లడించారు. మిగిలిన వారిని సురక్షితంగా తీసుకొస్తామని రాజ్యసభలో వివరించారు.
Similar News
News January 7, 2026
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

ఒడిశా కోరాపుట్ డివిజన్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (<
News January 7, 2026
₹46,750 కోట్ల వెనిజులా బంగారం స్విట్జర్లాండ్‌కు!

వెనిజులా మాజీ అధ్యక్షుడు మదురో హయాంలో ఏకంగా $5.2 బిలియన్ల (దాదాపు ₹46,750 కోట్లు) విలువైన బంగారం స్విట్జర్లాండ్‌కు తరలిపోయింది. 2013 నుంచి 2016 మధ్య సుమారు 113 మెట్రిక్ టన్నుల బంగారాన్ని రిఫైనింగ్ పేరుతో అక్కడికి పంపారు. దేశ ఆర్థిక సంక్షోభం సాకుతో ఈ అమ్మకాలు జరిగాయి. మదురో అరెస్ట్ కావడంతో స్విస్ బ్యాంకులు ఆయన ఆస్తులను స్తంభింపజేశాయి. అయితే ఈ గోల్డ్ తరలింపు వెనక గుట్టు ఏంటనే దానిపై క్లారిటీ లేదు.
News January 7, 2026
వైభవ్ మరో సెంచరీ

యూత్ క్రికెట్‌లో వైభవ్ సూర్యవంశీ హవా కొనసాగిస్తున్నారు. U19 సౌతాఫ్రికాతో జరుగుతోన్న మూడో వన్డేలో 63 బంతుల్లో సెంచరీ చేశారు. ఇందులో 8 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. మరో ఎండ్‌లో ఆరోన్(85) కూడా శతకానికి చేరువలో ఉన్నారు.
* మ్యాచ్‌ను యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు.


