News February 6, 2025
సిరిసిల్ల: చేనేత ఐక్యవేదిక ఉపాధ్యక్షుడిగా గోనె ఎల్లప్ప
తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడిగా సిరిసిల్ల పట్టణానికి చెందిన గోనె ఎల్లప్పను నియమిస్తున్నట్లు అధ్యక్షుడు రాపోలు వీర మోహన్ గురువారం తెలిపారు. ఈ మేరకు సిరిసిల్ల పట్టణంలో గురువారం ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎల్లప్ప మాట్లాడుతూ.. చేనేత రంగానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తన నియామకానికి సహకరించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు స్పష్టం చేశారు.
Similar News
News February 6, 2025
గోకవరం: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
కొత్తపల్లి నుంచి కామరాజుపేట వెళ్లే జంక్షన్ వద్ద గురువారం బైక్ అదుపుతప్పి రోడ్డుపై యువకుడు పడిపోయాడు. దీంతో అతడి తలకు బలంగా దెబ్బ తగిలినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే 108కు కాల్ చేసి గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 6, 2025
భీమారం: తాళం వేసిన ఇంట్లో చోరీ
భీమారంలోని ఐటీడీఏ కాలనీలో తాళం వేసిన ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. భీమారం ఎస్ఐ శ్వేత వివరాల ప్రకారం.. రాంటెంకి రంజిత్ కుమార్ జనవరి 31న తన కొడుకు అక్షరాభ్యాసం కోసం సిద్దిపేట మండలంలోని శనిగారం గ్రామానికి వెళ్లాడు. కాగా ఈనెల 5న ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి బీరువాలో రూ.50వేల నగదు, రూ.42వేల విలువ గల బంగారం చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.
News February 6, 2025
అందరి ముందు బట్టలు విప్పేసిన భార్యను సమర్థించిన భర్త
గ్రామీ అవార్డుల వేడుకలో అమెరికా స్టార్ సింగర్ కాన్యే వెస్ట్ భార్య బియాంకా సెన్సారి <<15346210>>నగ్నంగా<<>> కెమెరాలకు పోజులిచ్చిన విషయం తెలిసిందే. అయితే, తన భార్య చేసిన ఘనకార్యాన్ని కాన్యే సమర్థించారు. తన భార్య స్మార్ట్, టాలెంటెడ్, బ్రేవ్ అని వెనకేసుకొచ్చారు. తమపై విమర్శలొచ్చినప్పటికీ ఆరోజు అత్యధికంగా గూగుల్‌లో శోధించిన వ్యక్తిగా సెన్సారి నిలిచిందన్నారు. ఇది గ్రామీ అవార్డులను సైతం ఓడించిందని భార్యను కొనియాడారు.