News February 6, 2025
సికింద్రాబాద్: మెట్టుగూడలో దారుణం

సికింద్రాబాద్ మెట్టుగూడలో దారుణ ఘటన వెలుగుచూసింది. చిలకలగూడ పీఎస్ పరిధిలో నివాసం ఉంటున్న రేణుక(55), ఆమె కుమారుడు యశ్వంత్ (30)పై ఐదుగురు దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో తల్లి కుమారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News July 5, 2025
మరో రెండు రోజులు గోదావరి వరద ఉద్ధృతి

గోదావరిలో వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. మరో రెండు రోజులు వరద ప్రవాహం ఇదే తరహాలో ఉంటుందని గోదావరి హెడ్ వర్క్స్ ఈఈ శ్రీనివాస్ తెలిపారు. సీలేరుతో కలిపి శనివారం గోదావరి ఇన్‌ఫ్లో 1,70,929 క్యూసెక్కుల నీరు వస్తుందన్నారు. 3 డెల్టాలకు సాగునీటి అవసరాల నిమిత్తం 12,100 క్యూసెక్కులు విడిచిపెడతామన్నారు. మిగిలిన 1,60,218 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదలనున్నట్లు వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
News July 5, 2025
మహబూబ్ నగర్: IIIT.. టాప్ విద్యార్థులు వీళ్లే!

మహబూబ్‌నగర్‌లో IIIT క్యాంపస్ నూతనంగా ఏర్పాటు చేశారు. నిన్న విడుదల చేసిన క్యాంపస్ ఎంపిక ఫలితాల్లో హర్షిత(574) సంగారెడ్డి, నిహారిక(572) నారాయణపేట, శ్రీవిద్య(570) నిజామాబాద్, హాజీబేగం(569) సంగారెడ్డి, మొహమ్మద్ గులాం సాధిక్(568) జనగామ టాపర్లుగా నిలిచారు. ఉమ్మడి జిల్లాల్లో
MBNR-20, NGKL-21, GDWL-6, WNPT-4, NRPT-15 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకున్నారు.
News July 5, 2025
న్యూడ్ వీడియోలతో బెదిరింపులు.. నిందితుడి అరెస్ట్

విశాఖ అమ్మాయికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తి న్యూడ్ వీడియో కాల్ చేయించుకొని రికార్డ్ చేశాడు. ఈ వీడియోలు ఆమె తల్లికి పంపి డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. బాధిత మహిళ సీపీ శంఖబ్రత బాగ్చీని ఆశ్రయించారు. సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేసి బెదిరిస్తున్న వ్యక్తి కర్నూల్ జిల్లా వాసిగా గుర్తించారు. అతడిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.