News February 6, 2025
NZB: ఉపాధ్యాయులకు డీఈవో నోటీసులు

సమయానికి పాఠశాలకు హాజరు కాని నలుగురు ఉపాధ్యాయులకు డీఈవో అశోక్ షోకాజ్ నోటీసులను జారీ చేశారు. గురువారం నిజామాబాద్ వినాయకనగర్ ప్రాథమికోన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఆ సమయంలో టీచర్లు రాకపోవడంతో నోటీసులు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాఠశాల సమయానికి ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించడంతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
Similar News
News March 29, 2026
నిజామాబాద్: లోక్ అదాలత్‌లో 5,662 కేసులు క్లియర్

జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా నిజామాబాద్ జిల్లాలో 5,662 కేసులు పరిష్కారమైనట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. సైబర్ బాధితులకు రూ.31.82 లక్షల నగదును తిరిగి అందజేశామన్నారు. రాజీ మార్గమే రాజా మార్గం అని అన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ఇది ఉత్తమ వేదిక అని సీపీ పేర్కొన్నారు. కాగా లోకదాలత్ ద్వారా ఇది వరకే పెద్ద ఎత్తున కేసులు పరిష్కారం అయినట్లు ఆయన వివరించారు.
News March 29, 2026
NZB: బహిరంగ క్షమాపణ చెప్పిన కవిత

బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయినందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బహిరంగ క్షమాపణ చెప్పారు. ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ధర్నాకు కవిత మద్దతు ఇచ్చారు. ఆనాటి ప్రభుత్వ పాపంలో తనకు భాగం ఉందని తనను క్షమించాలని కోరారు. వెంటనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
News March 29, 2026
NZB: ఆరుగురికి వారం రోజుల చొప్పున జైలు

డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ఆరుగురికి ఒక్కొక్కరికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధించారు. నిజామాబాద్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ హైమద్ మొయినుద్దీన్ తీర్పు వెల్లడించారని NZB ట్రాఫిక్ CI పబ్బ ప్రసాద్ తెలిపారు. అలాగే 35 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.3.50 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.


