News February 6, 2025
Stock Markets: తప్పని నష్టాలు..

దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు నష్టపోయాయి. నిఫ్టీ 23,603 (-92), సెన్సెక్స్ 78,058 (-213) వద్ద క్లోజయ్యాయి. ఐటీ, ఫార్మా, ప్రైవేటు బ్యాంకు సూచీలు ఎక్కువ లాభపడ్డాయి. రియాల్టి, కన్జూమర్ డ్యురబుల్స్, మీడియా, మెటల్, ఎఫ్ఎంసీజీ సూచీలు ఎక్కువ ఎరుపెక్కాయి. సిప్లా, అదానీ పోర్ట్స్, ఐటీసీ హోటల్స్, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ టాప్ గెయినర్స్. ట్రెంట్, బీఈఎల్, ఎయిర్‌టెల్, టైటాన్, ఓఎన్జీసీ టాప్ లూజర్స్.
Similar News
News March 15, 2026
మీ ఎంపీనే డ్రగ్స్ పార్టీలో దొరికిపోయారు: వైసీపీ

AP: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన <<19386182>>డ్రగ్స్ పార్టీలో<<>> టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ పట్టుబడ్డారని వైసీపీ ట్వీట్ చేసింది. టీడీపీ డ్రగ్స్ మాఫియా తెలుగు రాష్ట్రాల్లో యువత భవిష్యత్‌ను నాశనం చేస్తోందని మండిపడింది. ‘మీ ఎంపీనే డ్రగ్స్ పార్టీలో దొరికిపోయారు. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు హోంమంత్రి’ అంటూ అనిత, చంద్రబాబు, పవన్, లోకేశ్‌ను ట్యాగ్ చేసింది.
News March 15, 2026
నెతన్యాహును వేటాడి మరీ చంపేస్తాం: IRGC

నెతన్యాహు మరణించలేదంటూ ఇజ్రాయెల్ చేసిన ప్రకటనపై ఇరాన్ స్పందించింది. ఒకవేళ ఆయన బతికే ఉంటే వేటాడి మరీ చంపేస్తామని IRGC హెచ్చరించింది. మరోవైపు నెతన్యాహు చేతికి ఆరువేళ్లు ఉన్నాయని.. అది <<19382555>>AI వీడియో<<>> అని ఇరాన్ వాదిస్తున్న విషయం తెలిసిందే. అయితే అది AI వీడియో కాదని, లైటింగ్ వల్ల ఆప్టికల్ ఇల్యూజన్ ఏర్పడి అలా ఒక వేలు ఎక్స్‌ట్రా ఉన్నట్లు కనిపిస్తోందనే వాదన వినిపిస్తోంది.
News March 15, 2026
బెండలో బూడిద, పల్లాకు తెగులు నివారణ

☛ బూడిద తెగులు వల్ల ఆకులు పచ్చబడి రాలిపోతాయి. నివారణకు లీటర్ నీటిలో 3 గ్రా. కరిగే గంధకపు పొడి లేదా 1mlడైనోకాప్ (లేదా) 2mlహెక్సాకొనజోల్ కలిపి పిచికారీ చేయాలి. ☛ బెండలో పల్లాకు తెగులు సోకిన ఆకుల ఈనెలు పసుపు రంగులోకి మారి, కాయలు గిడసబారి తెల్లగా మారిపోతాయి. పల్లాకు తెగులు నివారణకు లీటర్ నీటిలో 2.5 గ్రా. క్లోరోథలానిల్ (లేదా) 2.5 గ్రా. మ్యాంకోజెబ్ కలిపి పిచికారీ చేయాలి.


