News February 6, 2025
మూడు విడతలుగా ‘అన్నదాత సుఖీభవ’: చంద్రబాబు
AP: పీఎం కిసాన్ పేరిట కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరో రూ.14 వేలు కలిపి ‘అన్నదాత సుఖీభవ’ అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ఆర్థిక సాయాన్ని మూడు విడతలుగా ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పారు. దీనిపై విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. యువతకు ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు. రాబోయే మూడు నెలల్లో ప్రజలకు అందాల్సిన పథకాలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.
Similar News
News February 6, 2025
కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ భేటీ
TG: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఢిల్లీలో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, ఎంపీలు కూడా వేణును కలిశారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ, పీసీసీ పనితీరు, మంత్రివర్గ విస్తరణ, స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఆయనతో చర్చిస్తున్నట్లు సమాచారం.
News February 6, 2025
రూ.72 లక్షలు పెట్టి కష్టపడి వెళ్లినా..
అమెరికా పిచ్చితో హరియాణాకు చెందిన ఆకాశ్ (20) 2.5 ఎకరాల భూమి అమ్మి రూ.65 లక్షలతో అక్రమ మార్గంలో US వెళ్లాడు. ఏజెంట్లకు మరో రూ.7 లక్షలు చెల్లించాడు. పనామా, మెక్సికో మార్గంలో ఎన్నో కష్టాలు భరించి అక్కడికి వెళ్లానని తెలిపాడు. తాజాగా ఆకాశ్‌ను అమెరికా ప్రభుత్వం ఇండియాకు పంపడంతో కన్నీరుమున్నీరవుతున్నాడు. కాగా పంజాబ్, హరియాణా యువకుల్లో చాలా మందికి ఇంగ్లిష్‌పై పట్టు లేక US వీసాలు పొందలేకపోతున్నారు.
News February 6, 2025
త్వరలో వాట్సాప్‌లోనే బిల్స్ కట్టేయొచ్చు!
వాట్సాప్ ద్వారా కరెంటు బిల్లు, ఫోన్ రీఛార్జ్, LPG గ్యాస్, వాటర్ బిల్స్ కట్టే ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఇతర యాప్‌లతో పనిలేకుండా ఇందులో నుంచే బిల్ పేమెంట్స్ చేసేయొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉంది. కాగా భారత్‌లోని సెలక్టెడ్ యూజర్లకు ఈ యాప్ 2020లో మనీ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆ సేవలను యూజర్లందరికీ విస్తరించింది.