News February 6, 2025

పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తే కఠిన చర్యలు: CLP

image

TG: పార్టీ విధానాలను సొంత పార్టీ నేతలే తప్పుపడుతుండటంపై కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (CLP) మీటింగ్‌లో నేతలు చర్చలు జరిపారు. పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించే వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తుంటే ప్రజల్లోకి చెడు సంకేతాలు వెళ్తాయని, ఏవైనా విభేదాలుంటే అంతర్గతంగా చర్చించుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించినట్లు సమాచారం.

Similar News

News February 6, 2025

రూ.72 లక్షలు పెట్టి కష్టపడి వెళ్లినా..

image

అమెరికా పిచ్చితో హరియాణాకు చెందిన ఆకాశ్ (20) 2.5 ఎకరాల భూమి అమ్మి రూ.65 లక్షలతో అక్రమ మార్గంలో US వెళ్లాడు. ఏజెంట్లకు మరో రూ.7 లక్షలు చెల్లించాడు. పనామా, మెక్సికో మార్గంలో ఎన్నో కష్టాలు భరించి అక్కడికి వెళ్లానని తెలిపాడు. తాజాగా ఆకాశ్‌ను అమెరికా ప్రభుత్వం ఇండియాకు పంపడంతో కన్నీరుమున్నీరవుతున్నాడు. కాగా పంజాబ్, హరియాణా యువకుల్లో చాలా మందికి ఇంగ్లిష్‌పై పట్టు లేక US వీసాలు పొందలేకపోతున్నారు.

News February 6, 2025

త్వరలో వాట్సాప్‌లోనే బిల్స్ కట్టేయొచ్చు!

image

వాట్సాప్ ద్వారా కరెంటు బిల్లు, ఫోన్ రీఛార్జ్, LPG గ్యాస్, వాటర్ బిల్స్ కట్టే ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఇతర యాప్‌లతో పనిలేకుండా ఇందులో నుంచే బిల్ పేమెంట్స్ చేసేయొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉంది. కాగా భారత్‌లోని సెలక్టెడ్ యూజర్లకు ఈ యాప్ 2020లో మనీ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆ సేవలను యూజర్లందరికీ విస్తరించింది.

News February 6, 2025

GREAT: పండ్లు అమ్ముతూ జీవనం.. వచ్చిన లాభంతో అన్నదానం!

image

కేరళలోని త్రిసూర్‌లో జేసన్ పాల్ అనే వ్యక్తి పండ్లు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. అయినప్పటికీ ఆయన తనకొచ్చిన లాభంలో అధిక మొత్తాన్ని పేదల ఆకలి తీర్చేందుకు వెచ్చిస్తున్నారు. ఆయన వారంలో ఆరు రోజులు 100 నుంచి 150 మంది పేదలకు భోజనం అందిస్తున్నారు. పట్టలం రోడ్డులో రోజూ మధ్యాహ్నం 12 గంటలకు క్యాంపు ఏర్పాటు చేసి భోజనం పెడుతున్నారు. అన్నార్తుల ఆకలి తీర్చుతున్న జేసన్ పాల్ గొప్ప మనసును అభినందించాల్సిందే.

error: Content is protected !!