News February 6, 2025
అద్దంకి ఎక్సైజ్ PSను తనిఖీ చేసిన సూపర్నెంట్

అద్దంకి ఎక్సైజ్ స్టేషన్‌ను గురువారం బాపట్ల అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్నెంట్ వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన గీత కులాల మద్యం దుకాణాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. దరఖాస్తుల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని ఆయన సిబ్బందికి సూచించారు. అలాగే ఇటీవల కాలంలో నమోదు చేసిన కేసుల వివరాలను ఆయన ఎక్సైజ్ సీఐ భవానిని అడిగి తెలుసుకున్నారు.
Similar News
News October 21, 2025
మేడ్చల్‌లో యాక్సిడెంట్.. ఒకరు దుర్మరణం

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మేడ్చల్ పీఎస్ పరిధి జాతీయ రహదారిపై ఎల్లంపేట్ వివేకానంద విగ్రహం ముందు డబిల్ పూర్ చౌరస్తా వైపు వెళ్తున్న ఓ మినీ బస్సు అదుపు తప్పి మేడ్చల్ వైపు ప్రయాణిస్తున్న ముగ్గురు వాహనదారులను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News October 21, 2025
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు… అప్లై చేశారా?

AP: NTR జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో 20 కాంట్రాక్ట్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://ntr.ap.gov.in/
News October 21, 2025
ఆక్వా ఎగుమతుల్లో 60% వాటా ఏపీదే: లోకేశ్

AP: ప్రపంచ కొనుగోలుదారులతో రాష్ట్ర ఆక్వా ఎగుమతిదారుల అనుసంధానానికి ట్రేడ్ మిషన్, నెట్వర్కింగ్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేశ్ సీఫుడ్స్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా(SAI)ను కోరారు. కోల్డ్‌చైన్ మేనేజ్మెంటు, ప్యాకేజింగ్ రంగాల్లో ఆధునిక పరిజ్ఞానం, స్థిరమైన మత్స్యసంపద నిర్వహణకు నైపుణ్యాలు అందించాలన్నారు. ఇండియాలో ఆక్వా ఎగుమతుల్లో ఏపీ వాటా 60% పైగా ఉందని, 2024-25లో ₹66వేల కోట్ల ఎగుమతులు చేసిందని చెప్పారు.