News February 6, 2025
మోసాల గురించి జగనే చెప్పాలి: మంత్రి అనగాని

AP: మోసాల గురించి జగన్ చెబుతుంటే ప్రజలు ఫక్కున నవ్వుతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పార్టీని బంగాళాఖాతంలో కలపడం ఖాయమని విమర్శించారు. అధికారంలో ఉండగా MLAలను కలవని జగన్, ఇప్పుడు కార్యకర్తలకు అండగా ఉంటానంటే నమ్మే పరిస్థితులు లేవని ట్వీట్ చేశారు. మరోవైపు జగన్ అధికారంలో ఉన్నప్పుడు బటన్ నొక్కి బటర్ మిల్క్ మాత్రమే ఇచ్చారని BJP MLA ఆదినారాయణరెడ్డి విమర్శించారు.
Similar News
News September 17, 2025
ఓంకారం ఓ ఆరోగ్య సంజీవని

ఓంకారం కేవలం ఆధ్యాత్మిక సాధన మాత్రమే కాదు. ఇది ఓ సంపూర్ణ ఆరోగ్య సంజీవని. నాభి నుంచి పలికే ఈ లయబద్ధమైన శబ్దం శరీరంలోని ప్రతి అణువునూ ఉత్తేజపరుస్తుంది. దీని పఠనం రక్తపోటును తగ్గించి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇది ఊపిరితిత్తుల పనితీరును, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మానసిక ఒత్తిడి, ఆందోళనలను తొలగించి, అపారమైన ప్రశాంతతను అందిస్తుంది. ఓంకారం మనసు, శరీరం, ఆత్మల ఏకీకరణకు ఓ శక్తిమంతమైన సాధనం.
News September 17, 2025
కుమార స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఒకరేనా?

సుబ్రహ్మణ్య స్వామి, కుమార స్వామి వేర్వేరు కాదు. ఆయన శివ పార్వతుల కుమారుడు. గణపతి, అయ్యప్పలకి సోదరుడు. శివుడి కుమారుడు కాబట్టి కుమారస్వామి అనే పేరొచ్చింది. ఆయణ్నే సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయుడు, షణ్ముఖుడు, మురుగన్ వంటి పేర్లతో కూడా పిలుస్తారు. ఆయనను దేవతల సైన్యాధిపతిగా, జ్ఞానానికి, యుద్ధానికి దేవుడిగా పూజిస్తారు. ఆరు ముఖాలు, పన్నెండు చేతులతో దర్శనమిచ్చే ఆయన ఆధ్యాత్మిక శక్తికి, పవిత్రతకు ప్రతీక.
News September 17, 2025
‘అయ్యప్ప’ అంటే అర్థం ఇదే!

అయ్యప్ప స్వామి హరిహర పుత్రుడు. అయ్య అంటే విష్ణువును సూచించే అయ్యన్ అని, అప్ప అంటే శివుడిని సూచించే అప్పన్ అని అర్థం వస్తుంది. ఈ రెండు పదాల కలయికతోనే ఆయనకు అయ్యప్ప అనే పేరు వచ్చింది. ఆయనను ధర్మశాస్తా, మణికంఠుడు అని కూడా పిలుస్తారు. మహిషాసురిడి సోదరి అయిన మహిషిని సంహరించి అయ్యప్ప ధర్మాన్ని నిలబెడతాడు. శబరిమల క్షేత్రంలో కొలువై ఉంటాడు. భక్తులు ఇక్కడికి దీక్షతో వెళ్లి ఆయన ఆశీస్సులు పొందుతారు.