News February 6, 2025

మహాకుంభాభిషేకం మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

కాళేశ్వర ముక్తేశ్వర స్వామి పుణ్య క్షేత్రంలో మూడు రోజుల పాటు జరిగే మహా కుంభాభిషేకం మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. దేవస్థానంలో ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు నిర్వహించనున్న మహా కుంభాభిషేకం మహోత్సవాల రోజు వారి కార్యక్రమాల షెడ్యూల్‌ను గురువారం ఆయన ప్రకటించారు. స్వామి వారి తీర్థ ప్రసాదాల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News February 7, 2025

కోవ లక్ష్మికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత

image

ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గురువారం కోవ లక్ష్మికి శుభాకాంక్షలు తెలుపుతూ కవిత ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజల సేవకు అంకితమై సంతోషకరమైన, ఆరోగ్యకరమైన, సుధీర్ఘ జీవితాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకున్నారు.

News February 7, 2025

మహారాష్ట్రలో 173 GBS కేసులు

image

మహారాష్ట్రలో <<15225307>>గిలియన్ బార్ సిండ్రోమ్‌<<>> కేసుల సంఖ్య 173కి చేరింది. ఇవాళ కొత్తగా 3 కేసులు నమోదవగా, ఒక మరణం సంభవించింది. దీంతో ఆ రాష్ట్రంలో GBS అనుమానిత మరణాల సంఖ్య 6కి చేరింది. ఇప్పటివరకు ఆస్పత్రి నుంచి 72 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. పుణే సిటీలో 34, మున్సిపాలిటీ సరిహద్దు గ్రామాల్లో 87, ఇతర ప్రాంతాల నుంచి మిగిలిన కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

News February 7, 2025

ASF: ‘అభ్యర్థులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి’

image

తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ డెవలప్మెంట్ కేంద్రంలో అభ్యర్థులకు ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఆసిఫాబద్ అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. గురువారం ఆసిఫాబాద్‌లోని టాస్క్ సెంటర్‌ను డీఆర్డీవోతో కలిసి సందర్శించారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు ఏకాగ్రతతో చదవాలన్నారు.

error: Content is protected !!