News February 6, 2025

ఫైళ్ల క్లియరెన్స్.. సుభాశ్‌కు లాస్ట్ ర్యాంకు

image

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో అంబేడ్కర్ కోనసీమ జిల్లా మంత్రి వాసంశెట్టి సుభాశ్ 25వ ర్యాంకు పొందారు. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సీఎం సూచించారు.

Similar News

News March 7, 2026

ఇరాన్ యుద్ధంతో ఇండియన్ ఎకానమీకి ముప్పే: SBI రీసెర్చ్

image

పశ్చిమాసియాలో యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే ఇండియా గ్రోత్ రేట్ నెమ్మదిస్తుందని SBI రీసెర్చ్ వెల్లడించింది. ‘క్రూడాయిల్ ధరల పెంపుతో ద్రవ్యోల్బణం పెరిగి GDP వృద్ధి 0.25% వరకు తగ్గొచ్చు. హార్ముజ్ ద్వారా జరిగే చమురు సరఫరాకు ఆటంకం కలిగితే దిగుమతి ఖర్చులు భారమవుతాయి. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే డబ్బు, ట్రేడ్‌పై కూడా ప్రభావం ఉంటుంది. ఇది దేశ ఎకానమిక్ స్టెబిలిటీకి ఛాలెంజింగ్‌గా మారుతుంది’ అని హెచ్చరించింది.

News March 7, 2026

అనకాపల్లి: ఇంటర్ పరీక్షకు 429 మంది గైర్హాజరు

image

అనకాపల్లి జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 429 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఐఈవో వినోద్ బాబు తెలిపారు. మొత్తం 4,378 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా, 3,949 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలు ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు.

News March 7, 2026

కుటుంబ సర్వే రెండు రోజుల్లో పూర్తి కావాలి: VZM కలెక్టర్

image

ఏకీకృత కుటుంబ సర్వే రెండు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. శనివారం మండల వారీగా కలెక్టర్ టీసీ ద్వారా సమీక్షించారు. ఎక్కువ పెండింగ్ ఉన్న మండలాల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో పూర్తి చేయని వారిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. జిల్లా పరిషత్ సీఈవో పర్యవేక్షించాలని గంట గంటకు రిపోర్ట్ సమర్పించాలని జి.ఎస్.డబ్ల్యు కో ఆర్డినేటర్‌ను ఆదేశించారు.