News February 6, 2025
KNR: MLC ఎన్నికలకు ఈరోజు 15 నామినేషన్లు
MDK-NZB-KNR-ADB పట్టభద్రుల, ఉపాధ్యాయుల MLC ఎన్నికలకు సంబంధించి గురువారం 15 నామినేషన్లు దాఖలయ్యాయి. గ్రాడ్యుయేట్ MLC స్థానానికి 12 మంది నామినేషన్ వేయగా, టీచర్స్ MLCకి ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థుల నుంచి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నామినేషన్లు స్వీకరించారు. ఇప్పటివరకు పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు కలిపి మొత్తం 28 మంది నామినేషన్లు దాఖలయ్యాయి.
Similar News
News February 7, 2025
పెద్దపల్లి జిల్లాలోని నేటి టాప్ న్యూస్
@ ప్రియాంక గాంధీని కలిసిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ@ గోదావరిఖనిలో బులియన్ వ్యాపారి పరారీ@ వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి: కలెక్టర్ కోయ శ్రీహర్ష@ సుల్తానాబాద్ లో డయాబెటిస్ పరీక్షలకు విశేష స్పందన@ పెద్దపల్లి దుకాణాలలో మున్సిపల్ సిబ్బంది ఆకస్మిక తనిఖీ@ భరోసా సెంటర్ ద్వారా మహిళలకు రక్షణ: రామగుండం సిపి శ్రీనివాస్@ పెద్దపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం పై దాసరి ఉష విమర్శలు
News February 6, 2025
పడుకునే ముందు ఈ పనులు చేస్తే..
రాత్రి పడుకునే ముందు కొన్ని పనులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. పడుకునే ముందు వ్యాయామం చేయడం మానుకోవాలి. దీని వల్ల శరీరం ఉత్తేజితమై నిద్రకు ఆటంకం కలుగుతుంది. కాఫీ, చాక్లెట్లు తినకూడదు. వీటిలో ఉండే కెఫీన్ నిద్రలేమిని కలిగిస్తుంది. నిద్రించేముందు ఆల్కహాల్ తీసుకోకూడదు. అలాగే నీరు కూడా ఎక్కువగా తాగకూడదు. రాత్రి వేళల్లో స్మార్ట్ ఫోన్‌కు దూరంగా ఉండాలి. పడుకునే ముందు ఫోన్‌ను వేరే గదిలో ఉంచడం బెటర్.
News February 6, 2025
ఆర్థిక సహాయం అందజేసిన కలెక్టర్ సందీప్ కుమార్
తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన దాసరి రమేష్ కు SRCL కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా ఆర్థిక సాయం అందజేశారు. నేరెళ్ల గ్రామానికి చెందిన దాసరి రమేష్ లలిత దంపతుల పాప బుధవారం ప్రమాదవశాత్తు మరణించగా, బాధిత కుటుంబానికి తక్షణ సహాయం కింద బుధవారం రాత్రి రూ.లక్ష అందజేశారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా గురువారం మరో లక్ష రూపాయల చెక్కును అందజేశారు.