News February 6, 2025
బాపట్ల జిల్లా మంత్రులకు CM ర్యాంకులు

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో బాపట్ల జిల్లా మంత్రి గొట్టిపాటి రవికుమార్ 13వ ర్యాంక్, అనగాని సత్యప్రసాద్ 21 ర్యాంక్ పొందారు. పనితీరును మెరుగు పరుచుకోవాలని CM సూచించారు.
Similar News
News March 18, 2026
రెనాల్ట్ డస్టర్ మళ్లీ వచ్చేసింది!

ఫ్రాన్స్‌కు చెందిన రెనాల్ట్ కంపెనీ 4ఏళ్ల తర్వాత మిడ్ రేంజ్ SUVతో మళ్లీ IND మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘ఆల్ న్యూ డస్టర్’ 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో రాగా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ప్రారంభ ధర రూ.10.49లక్షలుగా ఉంది. ఇది గ్రాండ్ విటారా, క్రెటా, టాటా సియెర్రాకు పోటీ ఇవ్వనుంది. ఇక ఇదే మోడల్‌లో హైబ్రిడ్ వెర్షన్ 1.8L ఇంజిన్, 1.4 KWH బ్యాటరీతో త్వరలో లాంచ్ కానుంది.
News March 18, 2026
KNR: ఆర్టీసీలో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

KNR బస్టాండ్ ఆవరణలోని సమావేశ మందిరంలో ఆర్టీసీలో కరీంనగర్ రీజియన్ అప్రెంటిషిప్ కోసం దరఖాస్తు చేసుకున్న టెక్నికల్, నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్, డిప్లొమా అభ్యర్థుల ఒరిజినల్ ధ్రువపత్రాలను ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి.రాజు పరిశీలించారు. KNR RMతో పాటు డిప్యూటీ RM ఎస్.భూవతిరెడ్డి, పర్సనల్ ఆఫీసర్ ఎం.సంపత్ కుమార్, రీజనల్ మేనేజర్ కార్యాలయ సూపర్వైజర్లు బి.సత్తయ్య, ఎన్.శ్రీనివాస్ పరిశీలించారు.
News March 18, 2026
VJA: పప్పు ధాన్యాల సాగుపై ఎంపీ చిన్ని ఆరా

రాష్ట్రంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిపై MP చిన్ని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర మంత్రి జయంత్ స్పందిస్తూ.. 2025-26 సంవత్సరానికి గాను APలో 1,01,772 మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాల ఉత్పత్తి జరిగిందన్నారు. ఒక్క NTR (D)లోనే 1,631 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చినట్లు వివరించారు. దేశం పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు కేంద్రం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు.


