News March 19, 2024

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 736.38 పాయింట్లు నష్టపోయి 72,012కి పడిపోయింది. నిఫ్టీ 238.20 పాయింట్లు కోల్పోయి 21,817 వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో దాదాపు 1202 షేర్లు పెరగ్గా.. 2,458 షేర్లు పతనమయ్యాయి. వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్ ఈ వారంలో నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలోనే ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

Similar News

News November 16, 2024

నవంబర్ 16: చరిత్రలో ఈరోజు

image

* 1966: జాతీయ పత్రికా దినోత్సవం
* 1908: తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి జననం.
* 1923: తెలుగు సినీ నటుడు కాంతారావు జననం.(ఫొటోలో)
* 1963: భారతీయ సినీ నటి మీనాక్షి శేషాద్రి జననం.
* 1973: తెలుగు, తమిళ సినీ నటి ఆమని జననం.
* 1973: భారతదేశపు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ జననం.

News November 16, 2024

RECORD: సౌతాఫ్రికా ‘ఘోర’ పరాజయం

image

T20 క్రికెట్లో సౌతాఫ్రికా అత్యంత ఘోర పరాజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. చివరి మ్యాచ్‌లో సఫారీ జట్టును భారత్ 135 రన్స్ తేడాతో ఓడించింది. SAకు ఇదే అత్యంత భారీ ఓటమి. 2023లో ఆస్ట్రేలియా చేతిలో 111 రన్స్, 2020లోనూ ఆసీస్ చేతిలోనే 106 రన్స్ తేడాతో ఓడింది. అటు భారత్‌కు పరుగుల పరంగా 3వ అతి పెద్ద విజయం. భారత్ 2023లో NZపై 168 రన్స్, 2018లో ఐర్లాండ్‌పై 143 పరుగుల విజయం సాధించింది.

News November 16, 2024

చిన్నారుల మృతి బాధాకరం: CM యోగి

image

UPలోని మహారాణి లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీలో జరిగిన <<14624059>>ప్రమాదంలో<<>> చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరమని CM యోగి అన్నారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగం, సంబంధిత అధికారులను ఆదేశించారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు.