News February 6, 2025
మైలవరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

మైలవరం దర్గా దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. తిరువూరు విజయవాడ నుంచి తిరువూరు వైపుకు వెళ్తున్న ఆటో కారు ఢీకొన్నాయి. ఆటోలో ఉన్న వ్యక్తి మృతి చెందగా ఆటో డ్రైవర్, బాలుడు, ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు విజయవాడలో పెన్షన్ వెరిఫికేషన్‌కి వెళ్లి వస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News March 8, 2026
పార్వతీపురం: రైలు ఢీకొని యువకుడి మృతి

పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషన్‌లోని రైల్వే గేటు వద్ద గుర్తు తెలియని రైలు ఢీకొని గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడు. బ్రౌన్ కలర్ జీన్, నీలిరంగు టీ షర్ట్ ధరించాడు. 22 నుంచి 25 సంవత్సరాల వయసు ఉంటుందని హెచ్‌సీ రత్నకుమార్ ఆదివారం తెలిపారు. అతడి సమాచారం తెలిస్తే పార్వతీపురం జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
News March 8, 2026
పాలమూరు నుంచి పార్లమెంట్ దాకా..!

తెలంగాణలో బలమైన మహిళా నేత్రిగా పేరుపొందిన DK అరుణ ఆరుపదుల వయసులో కూడా జోష్‌తో సాగుతున్నారు. 1960 మే 4న నారాయణపేట్‌లో జన్మించారు. 18 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. గద్వాల నుంచి 2004-2018 వరకు MLA, వైఎస్, రోశయ్య కేబినెట్‌ల్లో మంత్రిగా 2019లో BJPలో చేరి జాతీయ ఉపాధ్యక్షురాలు, MPగా కొనసాగుతూ.. మహిళల సాధికారతకు విశేష సేవలు అందిస్తున్నారు. # నేడు ప్రపంచ మహిళా దినోత్సవం.
News March 8, 2026
అన్నింటా నువ్వే.. వందనాలమ్మా!

ఆమె.. మల్టీ టాస్కింగ్ చేయగల నేర్పరి. తల్లిగా, భార్యగా, కోడలిగా ఏకకాలంలో బాధ్యతలు నెరవేర్చగల ఎక్స్‌పర్ట్. ఇంట్లో జీతం తీసుకోని, రిటైర్మెంట్ లేని ఉద్యోగి. కుటుంబాన్ని నడిపించే ఆర్థికవేత్త. ఓపిక ఆమె బలం.. సహనం ఆమె ఆభరణం.. ప్రేమ పంచడంలో దైవం. అవకాశాల్ని అందిపుచ్చుకుని, అడ్డంకులను దాటుకుని, తమను తాము నిరూపించుకుని ఈ ప్రపంచానికి వెలుగునిచ్చే ప్రతి మహిళకు వందనం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.


