News February 6, 2025

భద్రాద్రి: కుటుంబ కలహాలతో ఏఆర్ ఎస్సై ఆత్మహత్య.. UPDATE

image

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాలో ఏఆర్ ఎస్సై సువర్ణపాక లక్ష్మీ నర్సు(36) <<15377589>>ఆత్మహత్యకు<<>> పాల్పడిన విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని 15వ బెటాలియన్‌కు చెందిన లక్ష్మీనర్సు భద్రాద్రి, బయ్యారం ఏఆర్ ఎస్సైగా పనిచేస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవ జరగగా.. భార్య సునీతను ఇంటి నుంచి గెంటి వేశారని, ఆమె హన్మకొండలోని బంధువుల ఇంటికి పిల్లలతో వెళ్లడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.

Similar News

News February 7, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: ఫిబ్రవరి 07, శుక్రవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.32 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.46 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.38 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.14 గంటలకు
✒ ఇష: రాత్రి 7.28 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 7, 2025

NZB: కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్  

image

రైతు భరోసా నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేయడం పట్ల బీఆర్ఎస్ నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. వెంటనే ఏకకాలంలో రైతు భరోసా నిధులు అన్నిటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే సర్పంచులకు పెండింగ్ బిల్లులను కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

News February 7, 2025

మంత్రి నిమ్మలను కలిసిన ఇరికిపెంట మాజీ సర్పంచ్

image

సోమల మండలంలోని ఇరికిపెంట చిన్నపట్నం చెరువును అభివృద్ధి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడిని ఇరికిపెంట మాజీ సర్పంచ్ శ్రీనివాసులు నాయుడు కోరారు. గురువారం విజయవాడలో మంత్రిని కలిసిన ఆయన చెరువు కట్ట, తూములు, ఆయుకట్టు కాలువల అభివృద్ధికి చొరవ తీసుకోవాలని కోరారు. ఈ మేరకు మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు.

error: Content is protected !!