News March 19, 2024
దోర్నాల : ప్రజాగళం సభకు వెళ్లి తిరిగి వస్తుండగా వ్యక్తి మృతి

ప్రకాశం జిల్లా దోర్నాల చెందిన మల్లికార్జున అనే వ్యక్తి చిలకలూరిపేట వద్ద జరిగిన ప్రజాగళం సభకు వెళ్లి తిరిగి వస్తుండగా వినుకొండ సమీపంలో స్కూల్ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం గుంటూరుకు తరలించారు. చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. కుటుంబ భారాన్ని మోసే వ్యక్తి చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు.
Similar News
News September 3, 2025
ప్రకాశం జిల్లా AR SPగా శ్రీనివాసరావు బాధ్యతలు

ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఎస్పీ దామోదర్‌ను ఏఆర్ విభాగం ఏఎస్పీ శ్రీనివాసరావు మర్యాదపూర్వంగా కలిశారు. ఏఆర్ ఏఎస్పీగా నియమితులైన శ్రీనివాసరావు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్‌కు మొక్కను అందించగా ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
News September 3, 2025
త్రిపురాంతకం సమీపంలో ప్రమాదం.. ఇద్దరి మృతి

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం అన్నసముద్రం మెట్ట వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఫోర్‌వీల్ వ్యాన్- బైక్ ఒకదానికొకటి ఢీకొని ఓ మహిళ సహా మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 3, 2025
ప్రకాశం జిల్లాలోని పరిశ్రమలకు గుడ్ న్యూస్..!

ప్రకాశం జిల్లాలోని వివిధ పరిశ్రమలకు చెందిన 149 క్లెయిములకుగాను రూ.3.25 కోట్ల రాయితీలను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మంజూరు చేశారు. బుధవారం ఆమె అధ్యక్షతన ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. పరిశ్రమల ఏర్పాటుకు అనుమతుల కోసం సింగిల్ డెస్క్ పోర్టల్‌లో వచ్చిన దరఖాస్తులను గడువు వరకు వేచి ఉండకుండా త్వరితగతిన మంజూరు చేయాలని కలెక్టర్ సూచించారు.