News February 6, 2025
BREAKING: మహబూబ్‌నగర్ జిల్లాలో MURDER

మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నందికొట్కూర్ వాసి షేక్ అబ్దుల్ రహమాన్ కూతురిని అదే గ్రామానికి చెందిన అలీ ఖాన్(36) తరచూ వేధిస్తున్నాడు. ఈక్రమంలో చిన్నచింతకుంట మండలం తిరుమలాపూర్‌లో ఈరోజు కూడా మళ్లీ ఆమెను వేధించసాగాడు. విషయం తెలుసుకున్న అబ్దుల్ రహమాన్ తన కూతురిని వేధిస్తావా అంటూ అలీని రాడ్డుతో కొట్టి చంపేశాడు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని తరలించారు.
Similar News
News April 3, 2026
గవర్నర్‌ను ఆహ్వానించిన ఎంపీ డీకే అరుణ

మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ శుక్రవారం హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో భేటీ అయ్యారు. మహబూబ్‌నగర్‌లో ఏప్రిల్ 9 నుంచి 24 వరకు నిర్వహించనున్న ‘ఖేల్ సంసద్’ క్రీడా మహోత్సవం గురించి గవర్నర్‌కు వివరించారు. ఈ క్రీడల ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలని కోరుతూ ఆహ్వాన పత్రం అందజేశారు. ముగింపు ఉత్సవానికి తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చినట్లు ఎంపీ అరుణ వెల్లడించారు.
News April 3, 2026
MBNR: మహిళల భద్రతకు ‘షీ టీమ్స్’ అండ: ఎస్పీ

MBNR జిల్లాలో మహిళలు, బాలికల భద్రతకు కట్టుబడి ఉన్నామని జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. మార్చి నెలలో షీ టీమ్స్ 15 ఫిర్యాదులు స్వీకరించి, 10 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా 22 అవగాహన కార్యక్రమాలు, 75 హాట్‌స్పాట్ తనిఖీలు చేపట్టామన్నారు. మానవ అక్రమరవాణా నియంత్రణకు AHTU బృందాలు సమన్వయంతో పని చేస్తున్నాయని, ఆపదలో ఉన్నవారు పోలీసులను ఆశ్రయించాలని ఆమె సూచించారు.