News February 6, 2025
డిగ్రీ అర్హతతో రూ.1.10 లక్షల జీతంతో ఉద్యోగాలు

224 పోస్టుల భర్తీకి AAI (ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్, సీనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం మార్చి 5లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. జనరల్ అభ్యర్థులు రూ.1,000 ఫీజు చెల్లించి అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. SC, STలకు వయసు సడలింపు ఉంటుంది. అభ్యర్థులు డిగ్రీ (హిందీ/ఇంగ్లిష్) చదివి ఉండాలి. నెలకు రూ.31,000-రూ.1,10,000 జీతం ఉండనుంది. aai.aero
Similar News
News March 7, 2026
తెలంగాణ సినీ అవార్డులు.. ఉత్తమ నటులు వీరే

☞ ఉత్తమ నటుడు- నాగ చైతన్య (తండేల్)
☞ ఉత్తమ నటి- రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్)
☞ ఉత్తమ సహాయ నటి: భూమిక
☞ ఉత్తమ దర్శకుడు: సాయిలు (రాజు వెడ్స్ రాబాయి)
>>>—జ్యూరీ స్పెషల్ అవార్డులు—<<<
☞ ఉత్తమ హీరో : రోషన్ (ఛాంపియన్)
☞ ఉత్తమ నటుడు : చైతు జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)
☞ ఉత్తమ నటి: అనంతిక (8 వసంతాలు)
News March 7, 2026
చిరంజీవికి తెలంగాణ గద్దర్ అవార్డు-2025

☞ ఎన్టీఆర్ నేషనల్ అవార్డు- చిరంజీవి
☞ పైడి జయరాజ్ అవార్డు- కమల్‌హాసన్
☞ సినారె అవార్డు- సుద్దాల అశోక్ తేజ
☞ అక్కినేని నాగేశ్వరరావు అవార్డు-జయసుధ
☞ నాగిరెడ్డి చక్రపాణి అవార్డు-అశ్వనీదత్
☞ రఘుపతి వెంకయ్య అవార్డు-రమేశ్ ప్రసాద్
☞ కాంతారావు అవార్డు- ఆర్.నారాయణమూర్తి
☞ బీఎన్ రెడ్డి అవార్డ్- సింగీతం శ్రీనివాస్
News March 7, 2026
ఇవాళ భారీగా లొంగిపోనున్న మావోలు.. గణపతి ఉంటారా?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎదుట ఇవాళ భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోనున్నారు. సాయంత్రం 4 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం నిర్వహించే ప్రెస్‌మీట్‌లో 124 మంది ఆయుధాలతో సహా సరెండర్ కానున్నారు. కేంద్ర బలగాలు, పోలీసులు ఎప్పటి నుంచో వెతుకుతున్న మావో టాప్ కమాండర్ గణపతి వీరిలో ఉంటారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది. ఇటీవల సరెండర్ అయిన దేవ్‌జీ సహా కీలక నేతల గన్‌మెన్లు, అనుచరులు లొంగిపోనున్నారు.


